అక్వాన్ తుపాను పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
అక్వాన్ తుపాను (Cyclone Akvan) పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. తుపాను గమనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను గంటకు 3.కి.మీ వేగంతో కదులుతోందని ఈ సాయంత్రానికి తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ (RTGS) అధికారులు తెలిపారు. విపత్తులు వచ్చాయని భయపడాల్సిన పనిలేదని, వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ హెచ్చరికలు పంపాలన్నారు. తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా కల్పించాలన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మÖడో తుపాను తాకుతోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం పంపాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా వెంటనే క్లియర్చేయాలి. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. తుపానుతో కురిసే భారీ వర్షాలకు చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు.







