బైడన్ ఆత్మకథ ప్రామిస్ మి.. నెతన్యాహుపై విమర్శలు..!
అమెరికాా మాజీ అధ్యక్షుడు జో బైడన్.. తన ఆత్మకథలో కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా గాజా యుద్ధం గురించి.. ఇజ్రాయెల్ వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు.యుద్ధానికి అండగా నిలిచామన్న బైడన్… అయితే అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పలుమార్లు మాట ఇచ్చి తప్పారన్నారు. ముఖ్యంగా అమాయక పౌరుల ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకుంటామని పదేపదే చెప్పి.. తర్వాత అంతకన్నా భీకర దాడులు చేశారని గుర్తు చేశారు.
ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న నెతన్యాహు.. దేశ ప్రయోజనాల కన్నా తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళ్లారని బైడన్ విమర్శించారు.
నవంబర్ 17న విడుదల కానున్న తన ఆత్మకథ ‘ప్రామిస్ మీలో బైడెన్ ఈ విషయాలను వెల్లడించారు.
అక్టోబర్ 7, 2023న హమాస్ దాడుల తర్వాత ప్రారంభమైన గాజా యుద్ధంలో, పౌరుల ప్రాణనష్టాన్ని తగ్గించాలని తాను నెతన్యాహును పలుమార్లు కోరినట్లు బైడెన్ తెలిపారు. “పౌర మరణాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చేవారు. కానీ ఆ తర్వాత మరింత మంది పౌరులు ప్రాణాలు కోల్పోయేలా దాడులు జరిగేవి. నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో నెతన్యాహుకు ఎలాంటి సంకోచం లేదు,” అని బైడెన్ తన పుస్తకంలో రాశారు.
హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు తాను ఎన్నటికీ చింతించనని బైడెన్ స్పష్టం చేశారు. అయితే, ఆ యుద్ధంలో అపారమైన సంఖ్యలో అమాయక పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఒక రాజనీతిజ్ఞుడిలా ఆలోచించడంలో నెతన్యాహు విఫలమయ్యారని, ఆయన తీరు కొన్నిసార్లు డొనాల్డ్ ట్రంప్‌ను గుర్తుకు తెచ్చేదని బైడెన్ వ్యాఖ్యానించారు.







