ఇసాయిస్ తుఫాను నేపథ్యంలో ఎమర్జెన్సీ టీమ్ ను ప్రకటించిన ATA
ఇసాయిస్ తుఫాను అమెరికా గల్ఫ్ లోని ఫ్లోరిడా, అలబామా తీరాలను తాకుతోంది. తాజా అంచనాల ప్రకారం ఈ తుఫాను ఫ్లోరిడాలోని పెన్సకోలా సమీపంలో తీరాన్ని తాకే ఛాన్స్ వుంది. దీంతో పశ్చిమ ఫ్లోరిడా పాన్ హ్యాండిల్, అలబామాలోని మొబైల్‌పై ప్రభావం పడొచ్చని అంచనాలు బలంగా వున్నాయి.
ఈ తుఫాను కారణంగా ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్, అలబామా మరియు టెన్నెస్సీ ప్రాంతాలు తీవ్ర ప్రభావంలో పడతాయని, అత్యధిక ప్రమాదంలో పడే అవకాశాలు కూడా వున్నాయి. ఈ తుఫాను నేపథ్యంలో ఏమైనా సహాయం అవసరమైన వారికి తోడ్పాటును అందించేందుకు ‘‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’’ ముందుకు వచ్చింది.
తుఫాను కారణంగా ఏమైనా సహాయాలు అవసరమైన వారి కోసం ATA ‘‘ఇసాయిస్ తుఫాను అత్యవసర బృందాన్ని’’ ఏర్పాటు చేసింది. ఎవరికైనా సహాయం అవసరమైతే ఈ నెంబర్లను సంప్రదించవచ్చు.
మహిపా రెడ్డి 904.314.6038
సుశీల్ చందా – 615.448.5033
కిరణ్ తడకమళ్ల – 614.866.8861
ATA సేవా టీమ్ – 1-855-ATA-DIAL
ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే ATA సమన్వయకర్త మిమ్మల్ని సంప్రదిస్తారు.








