‘‘వరల్డ్ ఫుడ్ మూవ్ మెంట్’’ లో పాల్గొన్న పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా.. సహాయం కొనసాగుతుందని హామీ
ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా, విద్యార్థులకు, పౌష్టికాహారం అందుబాటులో లేని వారికి ‘‘వరల్డ్ ఫుడ్ మూవ్ మెంట్ (WFM) న్యూజెర్సీలోని ఎసెక్స్ కౌంటీ కాలేజీలో విద్యార్థులకు భోజన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 6 వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా కూడా పాల్గొన్నారు. ఈయనే దాతగా వుండి, విద్యార్థులకు భోజనం స్వయంగా వడ్డించి, వారితో సంభాషించారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం వుండాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పినట్లయ్యింది.
నిజానికి అమెరికాలోని విద్యార్థులకు, రకరకాల సమాజాలకు పౌష్టికాహారం అందించేందుకు 2025 లో ‘‘వరల్డ్ ఫుడ్ మూవ్ మెంట్ (World Food Movement) ప్రారంభమైంది. అయితే.. ‘‘అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుంటూనే వరల్డ్ ఫుడ్ మూవ్ మెంట్ ప్రారంభమైంది.WFM తన ఆవిర్భావం నుండి న్యూజెర్సీ, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, బోస్టన్, డల్లాస్ మరియు వాషింగ్టన్ D.C. ప్రాంతాల్లోని వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులు మరియు ఆహార భద్రత లేని వ్యక్తులకు 70,000కు పైగా భోజనాలను అందించింది. దీని ద్వారా విద్యార్థులు, వివిధ వర్గాలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. తాము మరింత చురుగ్గా వుండడానికి, మరింత ఎక్కువగా విద్యను అభ్యసించడానికి ఇది ఎంతగానో దోహదపడుతోందని పేర్కొంటున్నారు.
‘‘విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందుబాటులో ఉన్నప్పుడు, వారు తమ చదువుపైనా, భవిష్యత్తుపైనా మరింత పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగలిగారు. ఎసెక్స్ కౌంటీ కాలేజీలోని ఈ కార్యక్రమం, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడం ద్వారా విద్యార్థులకు, సమాజాలకు మద్దతు ఇవ్వాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది,” అని వరల్డ్ ఫుడ్ మూవ్మెంట్, స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన నీరద దాస అన్నారు.
ఈ పర్యటనలో, సామాజిక నాయకుడు రాజేందర్ డిచ్‌పల్లితో కలిసి రాబర్ట్ వాద్రా విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త రాబర్డ్ వాద్రా మాట్లాడుతూ… ‘‘”ఆహారం వడ్డించడం అనేది మనం చేయగలిగే అత్యుత్తమ పనులలో ఒకటి. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వును చూడటం మరియు ఒక పూట భోజనం అవసరమైన శక్తిని ఇస్తుంది, ఇది నాకు అద్భుతమైన అనుభూతి. ‘వరల్డ్ ఫుడ్ మూవ్మెంట్’లో భాగం కావడం నాకు సంతోషాన్నిస్తోంది; నేను ఎక్కడికి వెళ్లినా నా శక్తిమేర సహాయం చేస్తూనే వుంటాను’’ అని హామీ ఇచ్చారు.
ఎసెక్స్ కౌంటీ కాలేజ్ అధ్యక్షుడు డాక్టర్ అగస్టిన్ ఎ. బోయాకీ మాట్లాడుతూ ‘‘విద్యార్థికి, చదువుకి మధ్య అనేక అడ్డంకులున్నాయి. అందులో ఆహారం కూడా ఓ సమస్యే. ఆ అడ్డంకిని తొలగిస్తే.. విద్యార్థులు కడుపు నిండా భోజనం చేసి, తమ చదువులో ముందుకు సాగడానికి పుష్కలంగా అవకాశం వుంది. అంతేకాకుండా పౌష్టికాహారం స్వీకరించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు, విద్య బాగా వస్తుంది. ఇలా ఆహారం విద్యార్థులకు అందించడంలో మేము కొంత మేర సఫలం అయ్యాం. ప్రస్తుతం ఇది ఒక చిన్న ప్రాజెక్ట్‌గా అనిపించవచ్చు, కానీ చాలా తక్కువ సమయంలోనే, ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు ‘ఈ కార్యక్రమం వల్లే నేను నా డిగ్రీని పూర్తి చేయగలిగాను’ అని చెప్పుకోగలుగుతారు.”అని పేర్కొన్నారు.
మరో వైపు ‘వరల్డ్ ఫుడ్ మూవ్మెంట్’ అమెరికాలోని పలు ప్రాంతాలలో భోజన సదుపాయం కల్పించే కార్యక్రమాలను ప్రారంభించింది మరియు మరిన్ని ప్రాంతాలకు తన కార్యకలాపాలను విస్తరించే దిశగా కృషి చేస్తూ వచ్చింది. 2030 నాటికి అమెరికాలో 10 లక్షల (ఒక మిలియన్) భోజనాలను అందించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఉదయం లేవగానే పిల్లలు పౌష్టికాహారం గురించి ఆలోచించకుండా, వారిపై భారకం పడకుండా శ్రద్ధగా విద్యార్థులు తమచదువును కొనసాగించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తోంది. మరీ ముఖ్యంగా కమ్యూనిటీ కాలేజీ విద్యార్థులు, ఆహార భద్రత లేని విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఎసెక్స్ కౌంటీ కాలేజీలో అక్టోబర్ 6న నిర్వహించిన కార్యక్రమం, ఆహార భద్రత లేమిపై అవగాహన కల్పించడం మరియు పౌష్టికాహారం పొందే అవకాశాలను కమ్యూనిటీ స్థాయిలో విస్తరించడం కోసం WFM చేపట్టిన విస్తృత ప్రయత్నంలో ఒక భాగం.








