బే ఏరియా ప్రాంతంలో దసరా, దీపావళి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
అమెరికాలోని బే ఏరియా ప్రాంతంలో దసరా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా, దీపావళి వేడుకలు అత్యంత వైభవోపేతంగా, అందరితో కలిసి ఆనందంగా, వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో, తమిళ్ మండ్రమ్ మద్దతుతో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే బాలీ 92.3 FM కూడా ఇందులో భాగమవుతోంది. అక్టోబర్ 17 వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకూ ఈ వేడుకలు జరుగుతాయి. Alameda County Fairgrounds, Pleasanton, CA వేదికగా ఈ వైభవోపేతమైన వేడుకలు జరిగేందుకు ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ రియల్టర్, లోన్ ఏజెంట్ అయిన లావణ్య దువ్వూరి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ధమాకా ఈవెంట్ లో భాగంగా నాన్ స్టాప్ గా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. వీటి కోసం రెండు స్టేజీలను కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఫెస్టివల్ షాపింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఫ్రీ హెల్త్ ఫెయిర్, కార్నివాల్ రైడ్స్, చెస్, కేరమ్స్ కాంపిటీషన్స్, సింగింగ్, అంత్యాక్షరి, బాలీవుడ్ సింగింగ్ కూడా వుంటుంది.
ఇక ఆధ్యాత్మికత విషయానికి వస్తే 10 అడుగుల ఎత్తు వున్న దుర్గా దేవీ విగ్రహాన్ని కూడా ఈ ధమాకా కార్యక్రమంలో ఏర్పాటు చేస్తుండటం స్పెషల్ హైలెట్. అలాగే డిస్కోతో కూడిన దాండతియా, హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం, అమ్మవారి రథయాత్ర, సింధూర్ ఖేలా, మహా మంగళ హారతి కూడా నిర్వహిస్తున్నారు.
అలాగే రావణ దహన కార్యక్రమాన్ని కూడా నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం 40 ఫీట్ల రావణుడి చిత్రాన్ని కూడా దహనం కోసం ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన ప్లెజంటన్లోని అలమేడా కౌంటీ ఫెయిర్గ్రౌండ్స్లో జరిగిన దసరా దీపావళి ధమాకాకు ప్రముఖ ట్యాక్స్ రంగ నిపుణులు సంజీవ్ గుప్తా బాణాసంచాను స్పాన్సర్ చేస్తున్నారు. వారికి నిర్వాహకులు ధన్యవాదాలు కూడా ప్రకటించారు. ఇంతటి ఘనమైన కార్యక్రమంలో మనమంతా కూడా మన మన కుటుంబీకులతో సహా హాజరై, కార్యక్రమానికి మరింత వన్నె తీసుకొద్దాం. అలాగే నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా పూర్తిగా పాల్గొంటూ, ఆనందోత్సాహలతో ఘనంగా కార్యక్రమాన్ని జరుపుకుందాం.








