ఆర్సీ17 కోసం మళ్లీ రంగస్థలం కాంబో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), డైరెక్టర్ సుకుమార్(Sukumar) కలయికలో తెరకెక్కనున్న ఆర్సీ17(RC17)పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇందులో రామ్ చరణ్ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ మరో కీలక అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు(Ratnavelu) పనిచేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గతంలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం(Rangasthalam) సక్సెస్‌లో రత్నవేలు సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషించింది. గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా తెరపై ఆవిష్కరించిన ఆయన పనితీరుకు అప్పట్లో విశేష ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురూ కలిసి పనిచేయనుండటంతో సినిమా విజువల్స్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్ పైనా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ను ప్రముఖ సంస్థ టీ సిరీస్ సొంతం చేసుకుంది. 2027లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశముంది. రంగస్థలం తర్వాత చరణ్‌ను సుకుమార్ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారన్నది ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు దారితీస్తోంది. త్వరలోనే నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.







