ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే చిల్లా తింటే ఆకలి అదుపులో ఉండి, రోజంతా ఎనర్జీ లభిస్తుంది. ఆ 7 చిల్లాలు ఇవే!
ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే పెసర చిల్లా జీర్ణక్రియకు మేలు చేస్తూ ఉదయాన్నే శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.
పెసరట్టు / మూంగ్ దాల్ చిల్లా
బేసన్‌లో క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర కలిపి చేసే చిల్లా ప్రోటీన్, విటమిన్లతో నిండి రుచిగా, కడుపు నిండుగా ఉంటుంది.
శనగపిండి వెజ్ చిల్లా
ఓట్స్, పెసరపిండి కలిపి చేసే చిల్లా కరిగే ఫైబర్, ప్రోటీన్‌తో బరువు నియంత్రణకు, స్థిరమైన ఎనర్జీకి ఎంతో బాగుంటుంది.
ఓట్స్ - పెసర చిల్లా
తురిమిన పనీర్‌తో చేసే చిల్లా హై ప్రోటీన్, కాల్షియం అందించి కండరాల బలానికి, రోజంతా చురుకుగా ఉండటానికి తోడ్పడుతుంది.
పనీర్ స్టఫ్డ్ చిల్లా
శనగపిండిలో పాలకూర తరుగు కలిపి చేసే ఈ చిల్లా ఐరన్, ప్రోటీన్ అందించి నీరసం, అలసట రాకుండా కాపాడుతుంది.
పాలకూర బేసన్ చిల్లా
రాగిపిండి, బేసన్ కలిపి చేసే చిల్లా కాల్షియం, ఫైబర్, ప్రోటీన్‌తో బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచి ఎనర్జీని నిలుపుతుంది.
రాగి - బేసన్ చిల్లా
మొలకెత్తిన పెసలు లేదా శనగలతో చేసే చిల్లా సహజ ప్రోటీన్, పోషకాలతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మరింత ఆరోగ్యంగా మారుస్తుంది.
స్ప్రౌట్స్ చిల్లా
తక్కువ నూనెతో నాన్‌స్టిక్ లేదా కాస్ట్ ఐరన్ పెనంపై కాల్చి, పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో తింటే రుచి, పోషకాలు రెట్టింపు.
మంచి ఫలితం కోసం చిట్కా
మీ ఉదయం మెనూలో ఈ 7 ప్రోటీన్ చిల్లాలను చేర్చుకోండి. రోజంతా ఉల్లాసంగా, ఎనర్జిటిక్‌గా, ఆరోగ్యంగా ఉండండి!