‘వృషకర్మ’ వరల్డ్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. విజువలైజేషన్, ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటాయి: మీనాక్షి చౌదరి
యువ సామ్రాట్ నాగచైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వృషకర్మ’. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘విరూపాక్ష’తో విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను పెంచింది. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘వృషకర్మ’లో మీరు చేసిన దక్ష క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
-డైరెక్టర్ కార్తిక్ గారు ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను డిజైన్ చేశారు. కథ చెప్తున్నప్పుడు కూడా ఈ క్యారెక్టర్‌ను ఎలా చేయాలి అనే విషయంపై చాలా ఆలోచనలు చేశాం. కార్తీక్ గారు ఈ పాత్ర కోసం ఎలాంటి లక్షణాలు అనుకున్నారో, అలాంటి పాత్రకు నన్ను ఎందుకు ఎంపిక చేశారనే దానిపై నాకు ఒక క్లారిటీ వచ్చింది.
– దక్ష చాలా ఫోకస్డ్గా ఉండే అమ్మాయి. తనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. తను ఆర్కియాలజీలో థీసెస్ చేస్తుంది. ఈ పాత్ర ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌కు చాలా మంచి గ్రాఫ్ ఉంది. ఈ క్రెడిట్ మొత్తం అద్భుతంగా క్యారెక్టర్ రాసిన కార్తీక్ గారికే దక్కుతుంది.
-కథ చెప్పిన తర్వాత నాగచైతన్య గారితో కలిసి రెండు రోజులు వర్క్‌షాప్ చేశాం. డైరెక్టర్ విజన్ ఏంటి? దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? అనే విషయాలపై ఒక అవగాహనకు వచ్చాం. వర్క్‌షాప్‌లో చాలా విషయాలపై రిహార్సల్స్ చేశాం. అలాగే ఆర్కియాలజీ గురించి చాలా లోతైన విషయాలు కూడా నేర్చుకున్నాను.
‘వృషకర్మ’ కథలో మీకు కొత్తగా అనిపించిన ఎలిమెంట్ ఏంటి?
-వృషకర్మ’ వరల్డ్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హారర్, మిథికల్ జానర్లో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ‘వృషకర్మ’ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విజువలైజేషన్, ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటాయి.
-కార్తీక్ గారి ‘విరూపాక్ష’నే తీసుకుంటే అది కంటెంట్ సినిమా. కానీ దాన్ని కమర్షియల్‌గా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా కూడా చాలా కంటెంట్ బేస్డ్గా ఉంటుంది. అదే సమయంలో కమర్షియల్‌గా కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఈ సినిమాలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమిటి?
నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. ఇందులో అలాంటి సీక్వెన్సులు ఉన్నాయి. అవి చాలా ఛాలెంజింగ్‌గా అనిపించాయి. అదే సమయంలో చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చాయి. చాలా ధైర్యంగా ఆ సీక్వెన్సులన్నీ చేశాను.
-అలాగే కొన్ని రఫ్ అండ్ టఫ్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో చాలా సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. ఇంతకుముందు ఇంత హెవీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా నేను చేయలేదు. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్.
మీరు హారర్ సినిమాలు ఇష్టపడతారా?
-చిన్నప్పుడు ఇంట్లో హారర్ సినిమాలు చూపించేవారు కాదు. ఎందుకంటే పీడకలలు వస్తాయని. కాకపోతే పెద్దయ్యాక అలాంటి సినిమాలను చాలా ఎంజాయ్ చేశాను. నాకు హారర్, థ్రిల్లర్, డిటెక్టివ్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా అంగీకరించడానికి అది కూడా ఒక కారణం.
నాగచైతన్య గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
-నాగచైతన్య గారితో కలిసి పనిచేయడం చాలా నైస్ ఎక్స్పీరియన్స్. ఆయన చాలా గ్రౌండెడ్‌గా, హంబుల్‌గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్.
కియారా పాత్ర ఎలా ఉండబోతోంది?
ఈ సినిమాలో చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్, నటీనటులు ఉన్నారు. సర్ప్ శ్రీవాస్తవ్, జయ్ రామ్ గారి ఇలా అందరూ అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్స్. ఇందులో కీయారా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సర్ప శ్రీ వాస్తవ్ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
మ్యూజిక్ గురించి?
ఇందులో పాటలు కథలో చాలా భాగంగా వస్తాయి. ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్ను రిప్రజెంట్ చేసేలా మ్యూజిక్ ఉంటుంది. థియేటర్లో అజినీస్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినడానికి ఎదురుచూస్తున్నాను.
మీ కెరీర్‌ను చూస్తే ప్రతి సినిమాకీ ఒక వైవిధ్యమైన పాత్ర చేస్తున్నారు. ఆ ప్రయాణం గురించి?
ఒక నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయడంపైనే నా దృష్టి ఉంది. కొత్త క్యారెక్టర్స్ ప్రయత్నించాలని కోరుకుంటాను. రెగ్యులర్‌గా ఒకే తరహా పాత్రలు, జానర్స్ వస్తే వాటిని చేయను. ‘లక్కీ భాస్కర్’ చూసిన తర్వాత చాలామంది మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. వాటికి నేను అంగీకరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్ చేశాను. కథ, పాత్ర కొత్తగా ఉన్నప్పుడే చేయాలని అనిపిస్తుంది. అలాగే నా కంఫర్ట్ జోన్ దాటి బయటికి వచ్చి కూడా క్యారెక్టర్స్ చేయాలని ఉంది.
‘వృషకర్మ’కు పార్ట్ 2 ఉంటుందా?
అది మీకు డిసెంబర్ 4న తెలుస్తుంది (నవ్వుతూ).
కొత్తగా చేస్తున్న సినిమాల గురించి?
కార్తీ గారితో చేస్తున్న సినిమా నా పోర్షన్ 60 శాతం పూర్తయింది. అది చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. వీటితో పాటు హిందీ, తమిళ్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను.







