రివ్యూ : స్టార్స్ వున్నా మెప్పించలేని ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : వుందేర్బార్ ఫిలిమ్స్,, ఆర్ టేక్ స్టూడియోస్
నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్, శివాజీ రాజా,
నసీరుద్దీన్ షా, చైతన్య జొన్నలగడ్డ, దయానంద్ రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం : సాయి అభయంకర్, సినిమాటోగ్రఫి : ఎజిల్ అరసు కే,
ఎడిటర్: ఆర్ కలైవనన్, ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం,
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్, స్టంట్స్: యానిక్ బెన్, కెచా
కొరియోగ్రఫి : శాండ, సౌండ్ డిజైన్: సింక్ సినిమా వీ
నిర్మాతలు: ధనుష్, శ్రద్దా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్
దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియాస్వామి
విడుదల తేదీ : 20.11.2026
విడుదల : సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్
నిడివి : 2 ఘంటల 58 నిముషాలు
పాన్ ఇండియా మూవీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ (OM :Chapter 1)సినిమాకి తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది కారణం జాతీయ అవార్డులు అందుకున్న హీరో ధనుష్,(Dhanush) మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammooti) సాయి పల్లవి వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించడంతో భారీ అంచనాలు నెలకొంది.
కథ:
ఆంధ్ర-తమిళనాడు బోర్డర్లో 2014-15 కాలం లో జరిగే కథ ఇది. దుబాయ్ కేంద్రంగా ఆంధ్రా, తమిళ రాష్ట్రాల సరిహద్దులో జరిగే గంధపు చెక్కల అక్రమ రవాణా దందాను అడ్డుకొనేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు బాస్‌గా నిత్యా రెడ్డి (సాయి పల్లవి)ని నియమిస్తారు. ఆమె టీమ్‌లో తిరు కుమరన్ అలియాస్ పళని (ధనుష్)ను అండర్ కవర్ ఆపరేషన్ ఆఫీసర్‌గా నియమిస్తారు. దాంతో కడప ప్రాంతంలో గంధపు చెక్కల వ్యాపారాన్ని పర్యవేక్షించే రాజకీయ నేత బర్మా కార్తీకేయ అలియాస్ సియా (మమ్ముట్టి) ముఠాలో తక్కువ టైమ్‌లోనే సియాకు రైట్ హ్యాండ్‌గా అత్యంత నమ్మకస్తుడిగా మారిపోతాడు తిరు కుమరన్. ఈ క్రమంలో దుబాయ్‌లో అబ్దుల్ (నసీరుద్దీన్ షా) ఆచూకీ కనుగొనేందుకు 1000 టన్నుల సరుకును పంపించేందుకు ప్లాన్ చేస్తాడు. అందులో 300 టన్నులను సక్సె స్ఫుల్గా చేరవేస్తారు. ఇక 700 టన్నలు శాండల్ఉడ్ను రవాణా చేసేందుకు సియా, తిరు ఇద్దరు ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలోనే పోలీసులకు, సియా ముఠా మధ్య ఎదురు కాల్పులు జరుగుతాయి.
ఈ క్రమంలో తిరు కుటుంబానికి తీరని నష్టం జరుగుతుంది. ఆ తర్వాత కార్తీకేయను అరెస్ట్ చేస్తారు.నిత్యా రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌గా నియమించిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి? కడప స్మగ్లింగ్ ముఠా చేతిలో నిత్యా రెడ్డి కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? తనకు జరిగిన అన్యాయానికి కారణమైన వారిని చట్టపరంగా ఎలా శిక్షించాలనుకొన్నది? సియాను తీరు ఎలా టార్గెట్ చేశాడు? సియాకు తిరు ఎలా నమ్మకస్తుడిగా మారాడు? తిరు కుమరన్ నుంచి భార్య రోజా ( శ్రీలీల) ఎందుకు డైవోర్స్ తీసుకోవాలనుకొన్నది? తిరుపై రోజాకు అసంతృప్తి కలగడానికి కారణం ఏమిటి? 700 టన్నుల గంధపు చెక్కలను రవాణా చేసే సమయంలో తిరుకు జరిగిన తీరని అన్యాయం ఏమిటి? సియాను అరెస్ట్ చేసిన తర్వాత అసలు డ్రామా ఏం జరిగింది? దుబాయ్ నుంచి అబ్దుల్‌ను రప్పించారా? అబ్దుల్‌ను అరెస్ట్ చేయడానికి ఎలాంటి ప్లాన్ వేశారు? రోజా, కొడుకు అగర, తండ్రి షణ్ముగ మల్లి (ఇంద్రన్స్) జీవితాలు ఏమయ్యాయి? నిత్యా రెడ్డి గతం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ఇవి కూడా చదవండి
నటీ నటుల హావభావాలు :
ఈ సినిమాలో ధనుష్ మాత్రమే హీరో అనడానికి లేదు. ధనుష్ తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి చేసినవి కూడా లీడ్ రోల్స్ అనే చెప్పాలి. వీరి ముగ్గురి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి హుందాగా ఉండే పాత్రలో ఒదిగిపోయారు. తిరుగా ధనుష్ ఎప్పటిలానే ఇరుగదీశాడు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో ఎందుకో రజినీకాంత్..ని ఇమిటేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మమ్ముట్టి ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపించారు. నిత్యా రెడ్డిగా సాయి పల్లవి పవర్ఫుల్ పాత్రలో జీవించారు. ఆమెను కొత్తగా చూసే అవకాశం లభించింది. యాక్షన్, ఎమోషనల్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించారు. శ్రీలీలకు స్క్రీన్ ప్లేస్ తక్కువైనా.. తన క్యారెక్టర్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ గుర్తుండిపోయేలా నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పరిసరాల్లో చోటు చేసుకున్న కొన్ని వాస్తవిక సంఘటనలను ఆధారం చేసుకుని.. ముఖ్యంగా ఎర్రచందనం చెట్లని కొట్టే పనుల్లోకి వెళ్లిన దళిత కూలీలను అన్యాయంగా పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే అందరి మైండ్లోకి ‘పుష్ప’ సినిమా వచ్చేస్తుంది. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే ‘O.M’ విషయంలో ఎక్కడా కూడా ‘పుష్ప’ ఛాయలు రాకుండా దర్శకుడు తీసుకున్న కేరింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా క్వాలిటీగా ఉంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ ఈ సినిమాకి మరో హీరో అని చెప్పాలి. ఫస్ట్ సాంగ్ బాగుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘వీర’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వచ్చే ఫారెస్ట్ ఫైట్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో.. కొంత పోర్షన్ ట్రిమ్ చేసి ఉంటే.. సినిమా వేగం పుంజుకునేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
తిరుపతి పరిసరాల్లో తమిళ కూలీల భూటకపు ఎన్కౌంటర్ సంఘటనను ఆధారంగా చేసుకొని దర్శకుడు రాజ్ కుమార్ రాసుకొన్న కథ, దానిని భావోద్వేగమైన సన్నివేశాలతో నింపిన విధానం బాగుంది. ఈ కథ కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్లు, వాటి కోసం ఎంపిక చేసిన నటీనటుల ప్రక్రియతోనే ఈ సినిమా దాదాపు సక్సెస్ సాధించిందనే చెప్పాలి. ఫస్టాఫ్ అందించిన ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెంచుతుంది. కానీ ఆ అంచనాలకు మించి సినిమా కథ, కథనాలు ఉండకపోవడంతో రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా మారిపోతుంది. మమ్ముట్టి, నసీరుద్దీన్ షా అరెస్ట్ టార్గెట్‌గా కథ సాగుతుంది. ఇక మమ్ముట్టికి ధనుష్ చేసిన నమ్మక ద్రోహాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమం ఆకట్టుకొనేలా ఉంటుంది. సాయి పల్లవి బ్యాక్ స్టోరీ సినిమాకు ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. క్లైమాక్స్ రెగ్యులర్ ఫైట్స్‌తో ముగించడం రొటీన్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌ను ఇంకాస్త బెటర్‌గా ప్లాన్ చేసి ఉంటే.. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయ్యే అవకాశం ఉండేది. స్పై యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘ఓం’.. గుడ్ మెసేజ్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా..స్టార్స్ వున్నా సినిమా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.







