మహారాష్ట్ర మండల్ చికాగో ఆధ్వర్యంలో ’’ఆది అనంత’సినిమా ప్రదర్శన
మహారాష్ట్ర మండల్ చికాగో ఆధ్వర్యంలో ఆది అనంత’సినిమా ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరాఠీ సమాజంలో వున్న ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకూ దీనిని ప్రదర్శిస్తారు. 930 నేషనల్ పార్క్వే, షాంబర్గ్, IL 60173 వేదికగా ఈ ప్రదర్శన వుంటుంది.
ఈ ప్రదర్శనకు హాజరయ్యే కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 డాలర్లను విరాళంగా నిర్ణయించారు. అయితే, ఇది పూర్తిగా ఐచ్ఛికం (Optional) మాత్రమే. ఈ విధంగా సమకూరే విరాళాలను ‘ఇండియా హబ్’ (India Hub) సంస్థకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సినీ ప్రేమికులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరై సినిమాను ఆస్వాదించాలని మహారాష్ట్ర మండళ్ షికాగో నిర్వాహకులు కోరారు.







