రాయల్ లుక్లో మిల్కీ బ్యూటీ గ్లామర్ షో
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందంతో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న తమన్నా, తన అందానికి ఆధునిక హంగులు అద్దితే ఎలా ఉంటుందో ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. గులాబీ, మెరూన్ రంగుల మేళవింపుతో రూపొందించిన డిజైనర్ లెహంగాలో మిల్కీ బ్యూటీ అదరగొట్టింది. గోల్డ్ కలర్ లో తీర్చిదిద్దిన సున్నితమైన ఎంబ్రాయిడరీ దుస్తులకు తమన్నా రాయల్ లుక్ను తీసుకొచ్చింది. మెడలో నల్లని చోకర్ నెక్లెస్, విరబోసుకున్న కురులు, మినిమల్ మేకప్ ఆమె అందాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చగా, ఈ ఫోటోలో తమన్నా తన ఎద, నడుము అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల చూపుల్ని తిప్పుకోయనీయకుండా చేస్తుంది.







