‘మొహబ్బత్’ నుంచి ‘వరమే’ అంటూ సాగే యూత్ ఫుల్ లవ్ సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ విఐ ఆనంద్
ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందిన చిత్రం ‘మొహబ్బత్’. అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ మూవీకి మ్యాక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో భాగంగా ‘వరమే’ అంటూ సాగే యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ మ్యూజికల్ ప్రమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకునేందకు టీం రెడీ అయింది. అందుకే పాటలతో శ్రోతల్ని ఆకట్టుకునేందుకు ముందుగా ఓ అందమైన ప్రేమ గీతాన్ని వదిలారు.
ఇవి కూడా చదవండి
డైరక్టర్ విఐ ఆనంద్ చేతుల మీదుగా ‘వరమే’ అనే ఈ పాటను రిలీజ్ చేశారు.‘వరమే’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని కృష్ణ తేజస్వి ఆలపించగా.. భాష్య శ్రీ ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. సునీల్ కశ్యప్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. యూత్ ఆడియెన్స్‌కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంది. లిరికల్ వీడియోలో మొయిన్ కంపోజ్ చేసిన తీరు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. సింపుల్ స్టెప్స్‌తో కథని నడిపిస్తూ ఎంతో అందంగా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ ‘వరమే’ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది.







