పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ టెలీ కాన్ఫరెన్స్
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండు, మూడు విడతల పంచాయతీ ఎన్నికలపై టెలీ కాన్ఫరెన్స్. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపిన నారా లోకేష్. కూటమి విజయ పరంపర కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం… పంచాయతీ ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థులు అద్భుత విజయాలు సాధించారు. జరగబోయే రెండు, మూడు విడత పంచాయతీ ఎన్నికల్లోనూ… కూటమి మద్దతు అభ్యర్థులు విజయం సాధించాలి. మనకు బలం ఉందని రిలాక్స్ కావొద్దు.
ఇవి కూడా చదవండి
ఎన్నికను ఎన్నికగానే చూడాలి… చిన్నదైనా… పెద్దదైనా ప్రతి ఎన్నికనూ సీరియస్గా తీసుకోవాలి. పోలింగ్ ఎంత ఎక్కువ జరిగితే మన మెజార్టీలు అంత ఎక్కువ పెరుగుతాయి. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో ఎంత కష్టపడ్డామో పంచాయతీ ఎన్నికల్లోనూ అంత కంటే ఎక్కువ కష్టపడి పని చేయాలి. జనసేన-బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. సీఎం చంద్రబాబు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉన్నారు.
ఎన్నికలు లేని నియోజకవర్గాలకు చెందిన నేతలు కూడా పంచాయతీ ఎన్నికల్లో అవసరమైన నియోజకవర్గాల్లో సేవలందించాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి. బలహీనంగా ఉన్న చోట గెలవాలి… బలంగా ఉన్న చోట మరింత మెజార్టీలు సాధించాలి. వరుస ఓటములతో గొడ్డలి పార్టీ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తోంది. ఎన్నికల్లో గొడ్డలి పార్టీ నేతలు హింసకు పాల్పడుతున్నారు. గొడ్డలి పార్టీ చేసే దాడులు, కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి.







