గులాబీ రంగు చీరలో అందాల అనుపమ
సహజమైన అందం, అభినయంతో ఆడియన్స్ మనసు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) సంప్రదాయ వస్త్రధారణలోనూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటుంది. తాజాగా పింక్ కలర్ శారీలో మెరిసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తన సొగసుతో ఆకట్టుకుంటోంది. చీరకు సరిపోయే స్లీవ్‌లెస్ బ్లౌజ్ ఆమె లుక్కు మరింత అందాన్ని తీసుకురాగా, మెడలో ముత్యాల హారం, చెవులకు చిన్న కమ్మలు, చేతికి ముత్యాల బ్రాస్లెట్తో సింపుల్‌గా కనిపిస్తూనే క్లాసీ లుక్‌ను సొంతం చేసుకుంది. అందంగా తీర్చిదిద్దిన కురులు, నుదుటన చిన్న బొట్టు, సహజత్వం ఉట్టిపడే మేకప్ ఈ ఫొటోషూట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ ఆభరణాలు, హంగులు లేకుండానే తనదైన శైలిలో అనుపమ అందాన్ని ఆవిష్కరించగా, సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ కెమెరాకు ఇచ్చిన స్టైలిష్ పోజులు ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి







