శిలాఫలకంలో మార్పులు చేయండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి జిల్లా మంథనిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సరిదిద్దాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamshikrishna) కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju)కు లేఖ (Letter) రాశారు. శిలాఫలకంపై సీఎం (CM), సంబంధిత శాఖ మంత్రి (Minister) పేరు లేకపోవడం విచిత్రం, సీఎం పేరు కూడా లేదంటే, సమస్య శిలాఫలకంపై కాదు, ఆలోచనలోనే ఉంది. సీఎం పేరు విస్మరించడం కార్యానిర్వాహక పదవి గౌరవానికి భంగే అని అన్నారు. శిలాఫలకంపై పేర్ల ఖరారు విషయంలో విచారణ జరిపి వెంటనే మార్చేందుకు ఆదేశించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.







