రెడ్ డ్రెస్‌లో నమ్రత రాయల్ లుక్!
నమ్రత శిరోద్కర్(Namratha Sirodkar) పరిచయం అక్కర్లేని పేరు. మోడలింగ్ తో కెరీర్ ను మొదలుపెట్టి, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నమ్రత తన ఫ్యాషన్ ఎంపికలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో క్లాసీ లుక్‌తో ఆకట్టుకుంటోంది నమ్రతా శిరోద్కర్. రెడ్ డ్రెస్‌కు గోల్డెన్ బెల్ట్ జోడించి తన ఫ్యాషన్ టేస్ట్ ను చాటుకుంది నమ్రత. మెడలో పొడవాటి గోల్డెన్ చైన్, చెవులకు చిన్న రింగులు, చేతికి ట్రెండీ బ్రేస్లెట్స్ ఆమె లుక్కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. సాఫ్ట్ మేకప్, లూజ్ హెయిర్, అందమైన చిరునవ్వుతో కెమెరాకు ఇచ్చిన పోజులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. సింప్లిసిటీకి, మోడ్రన్ ఫ్యాషన్‌కు మధ్య బ్యాలెన్స్ ను చూపిస్తూ రాయల్ లుక్‌లో మెరిసిన నమ్రత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.







