ఇంటి వద్దకే బంగారం, వెండి నాణేలు.. నిహార్ ఇన్ఫో వినూత్న కార్యక్రమం
నిహార్ ఇన్ఫో గ్లోబల్ సంస్థ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మన మన ఇంటి వద్దకే బంగారం, వెండి నాణేలను అందించే సేవలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గోల్డ్ఎన్ సిల్వర్. షాప్ అనే పోర్టల్ ద్వారా పసిడి, వెండిని విక్రయిస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడులు, బంగారం రుణాలకు సిఫార్సులు, పసిడిని తిరిగి కొనడం వంటి సేవలను కూడా ప్రారంభిస్తున్నామని కంపెనీ చైర్మన్ ఈఎస్ఎన్ సూర్యనారాయణ ప్రకటించారు.
Goldnsilver.shop ప్లాట్ ఫారమ్ ద్వారా బంగారం, వెండి, నాణేలు, బహుమతి ఉత్పత్తులతో పాటు డిజిటల్ గోల్డ్ ను కూడా మనం కొనుగోలు చేయవచ్చును. సంస్థ సొంత బ్రాండ్ కింద విక్రయిస్తున్న వెండి నాణేలకు ఫ్లిప్ కార్ట్ లోనూ అమ్మకాలకు అనుమతి లభించింది. సమీప భవిష్యత్తులో బంగారం, వెండిలను రిటైల్ మార్కెట్లో విక్రయించనున్నట్టు, అలాగే గోల్డ్-వెండి ఈటీఎఫ్‌లు, గోల్డ్ బైబ్యాక్ సేవలను కూడా ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.6.87 కోట్ల ఆదాయంపై రూ.కోటి రూపాయల లాభాన్ని గడించింది.







