దక్షిణాది డెయిరీ రంగంలో సరికొత్త వృద్ధి మార్పు.. పూర్తిగా ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తులపైనే ప్రత్యేక దృష్టి!
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా , పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం వినియోగదారులు తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ వారి ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తున్నాయనే కోణంలో సరికొత్త మార్పు తెరపైకి వస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ దైనందిన జీవన అలవాటుగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటుండగా, జాతీయ స్థాయిలో సగానికంటే తక్కువ మందే అలా తీసుకుంటున్నారు. జాతీయ సరాసరి వినియోగం ఏడాదికి ఒక్కో వ్యక్తికి 2.8 కిలోలుగా ఉంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ప్యాక్ చేసిన పెరుగు వినియోగం సంవత్సరానికి 4.2 కిలోలుగా నమోదవుతోంది.
అయితే, ఈ వినియోగ అలవాట్లకు తగినట్లుగా ప్రొటీన్‌పై అవగాహన మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో పెరగలేదు. పట్టణ ప్రాంతాల్లో ఆరుగురు భారతీయుల్లో నలుగురు ప్రతిరోజూ ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం లేదని, దాదాపు ముగ్గురిలో నలుగురికి తమ శరీరానికి అసలు ఎంత ప్రొటీన్ అవసరమో కూడా తెలియడం లేదని తేలింది. ఆరోగ్యకరమైన వయోజనులు శరీర బరువులో ప్రతి కేజీకి 0.66 నుండి 0.83 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సిఫార్సు చేస్తోంది. మరోవైపు, దక్షిణాది రాష్ట్రాలలో డెయిరీ రంగం అత్యంత వేగంగా విలువైన వృద్ధిని కనబరుస్తుండటమే కాకుండా, ప్రొటీన్ ఆధారిత ఆహార పదార్థాల కోసం దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.
గోద్రెజ్ జెర్సీ సీఈఓ గౌరవ్ పాండే మాట్లాడుతూ, డెయిరీ వినియోగం గురించి దక్షిణాది ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఈ అలవాటు ఇప్పటికే ప్రతి ఇంటి వంటగదిలో భాగమైందని తెలిపారు. వినియోగదారులు తాము రోజూ తినే పెరుగు , పన్నీర్లో ఉన్న ప్రొటీన్‌ను గుర్తించేలా చేయడమే పరిశ్రమ ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ఒక యువ ఉద్యోగి యాప్‌లో ప్రొటీన్‌ను ట్రాక్ చేయగలడని, కానీ ఉదయం పూట తినే ఒక గిన్నె పెరుగులోని ప్రొటీన్‌ను మాత్రం లెక్కించకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని మొదట గుర్తించేలా చేయగలిగే డెయిరీ వ్యాపారమే, ప్రొటీన్ విషయంలో మిగతా భారతదేశం ఏ విధంగా ఆలోచించాలనే దానిపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.







