ఇది నిజం కాదని జగన్ చెప్పగలరా? యామినీ శర్మ
వైఎస్ జగన్ 9YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైవే విస్తరణకు ఆంజనేయస్వామి ఆలయ (Anjaneyaswamy Temple) భూమి సేకరణను చేపట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ 9Yamini Sharma) తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆనాడే అధికారులు పరిహారాన్ని ఖరారు చేశారు. ఇది నిజంకాదని జగన్ చెప్పగలరా? ఆలయ భూమిని ఇచ్చేందుకు అప్పట్లోనే ఒప్పందంపై సంతకాలు చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతూ దుష్ప్రచారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికి జగన్, కరుణకార్ రెడ్డి (Karunakar Reddy)లు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వందల దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు జగన్ నోటి నుంచి ఒక్కసారైనా హే రామ్ అనే మాట ఎందుకు రాలేదు? జగన్, కరుణాకర్ రెడ్డిలు తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.







