విశాఖలో అంతర్జాతీయ స్టోన్ ఫెస్ట్ : మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదను ప్రపంచానికి చూపేందుకు అంతర్జాతీయ స్టోన్ ఫెస్ట్ (International Stone Fest)-2026ను వచ్చే నెల 10 నుంచి 13 వరకు విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల (AU College of Engineering) మైదానంలో నిర్వహిస్తున్నట్లు గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ గ్రానైట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి, దేశ, విదేశాలకు చెందిన మైనింగ్ వ్యాపారులు, లీజుదారులు పాల్గొంటారని తెలిపారు. మైనింగ్ ఇన్ ఆంధ్రా- ఓపెన్ టు ద వరల్డ్ నినాదంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.







