శాంతిభద్రతలకే మొదటి ప్రాధాన్యత : అనిల్‌చంద్ర పునేఠా
మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా (Anilchandra Punetha) సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు (District Collectors), ఎస్పీలు ( SPs), ఇతర అధికారులతో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బలవంతపు ఏకగ్రీవాలు ఉండకూడదన్నారు. ఏకగ్రీవాల కారణంగా భద్రతా బలగాల లభ్యత ఉంటుందని తెలిపారు. మొదటి దశలో ఏకగ్రీవాలు 15 నుంచి 20 శాతం జరుగుతాయని ఆశిస్తే 19 శాతం వరకూ జరిగాయన్నారు.







