మళ్లీ రంగంలోకి రౌడీ హీరో!
వరుస ఫ్లాపులతో సతమతమైన విజయ్ దేవరకొండకు రణబాలి సినిమా కొంత ఊరటనిచ్చింది. ఇటీవల షూటింగ్‌లకు స్వల్ప విరామం ఇచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌లో విహరించి వచ్చారు. తర్వాత చెన్నైలో జరిగిన అనిరుధ్- కావ్య పెళ్లి రిసెప్షన్‌కు రష్మిక మందన్నతో కలిసి హాజరయ్యారు. తాజాగా మళ్లీ సినిమా పనుల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రౌడీ జనార్దన షూటింగ్ మహారాష్ట్రలో జరుగుతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఈ భారీ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్‌లోని మాస్ యాంగిల్ ను ఆడియ్స్ కు మరోసారి పరిచయం చేసే సినిమాగా దీనిపై మంచి ఆసక్తి నెలకొంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
క్రిస్టో జేవియర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 2027 వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అందుకు అనుగుణంగా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. కెరీర్లో మరో భారీ సక్సెస్‌ను అందుకోవాలని ప్రయత్నిస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ కథాంశంతో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.







