వైట్ అండ్ గోల్డ్ లుక్‌లో అనన్య మెరుపులు
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) తనదైన ఫ్యాషన్ తో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజాగా అమ్మడు ఐవరీ వైట్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రాజసంగా కనిపిస్తోంది. గోల్డెన్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన కార్సెట్ టాప్, చీర తరహాలో తీర్చిదిద్దిన డ్రేపింగ్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ శైలికి మోడ్రన్ టచ్ ఇచ్చిన ఈ అవుట్‌ఫిట్ ఎంతో అందంగా ఉంది. స్ట్రెయిట్ హెయిర్ స్టైల్, నేచురల్ మేకప్, న్యూడ్ షేడ్ లిప్‌స్టిక్‌తో అనన్య తన అందాన్ని మరింత హైలైట్ చేసింది. చేతికి లగ్జరీ వాచ్ ఆమె స్టైలిష్ లుక్కు ఎక్స్ట్రా ఎట్రాక్షన్ గా నిలవగా, భారీ ఆభరణాలకు దూరంగా ఉంటూ సింపుల్‌గా, క్లాసీగా కనిపించింది. ఓ వైపు చిరునవ్వు, మరోవైపు హుందాతనంతో కూడిన ఫొటోలకు పోజులిస్తూ ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకునేలా కనిపిస్తోంది అనన్య.







