పోస్టర్‌తోనే ఆసక్తి రేపిన కిరణ్ అబ్బవరం
విభిన్న కథలతో ఆడియన్స్ ను అలరిస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్న తాజా సినిమాకు రికార్డ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీర కొగటం డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ బ్యానర్లపై వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, డైరెక్టర్ సుకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు డీవీవీ దానయ్య, దిల్ రాజు మేకర్స్ కు స్క్రిప్ట్‌ను అందజేశారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఎర్రటి పున్నమి చంద్రుడి బ్యాక్ గ్రౌండ్ లో కిరణ్ అబ్బవరం నీడ, కెమెరాకు సంబంధించిన సంకేతాలు, చీకట్లో నడుస్తున్న యువతి, గాడిద వంటి అంశాలు కథలో ఏదో బలమైన రహస్యం దాగి ఉందనే భావనను కలిగిస్తున్నాయి. సినిమా కథాంశాన్ని వెల్లడించకుండానే పోస్టర్‌తో ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తించారు. ఈ సినిమాకు మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూడు నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.







