యాంకర్ నుంచి కమ్యూనికేషన్ కోచ్‌గా సుమ
ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల(Suma kanakala) మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. తన చలాకీ మాటలు, టైమింగ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకునే సుమ ఇప్పుడు కమ్యూనికేషన్ కోచ్‌గా మారారు. స్కిల్ స్టూడియో ప్రో సహకారంతో అన్‌మ్యూట్ విత్ సుమ- స్పీక్ బోల్డ్లీ పేరుతో స్పెషల్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. జనవరి 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలుగులో ఈ కార్యక్రమం జరగనుంది. 18 ఏళ్లు నిండినవారు ఇందులో పాల్గొనవచ్చు.
ఇవి కూడా చదవండి
బహిరంగ వేదికలపై మాట్లాడేందుకు భయపడేవారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ వర్క్‌షాప్ మెయిన్ టార్గెట్. ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడం, సందర్భానుసారంగా రియాక్ట్ అవడం, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తనలా ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలని ఫ్యాన్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తులే ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచాయని సుమ వెల్లడించారు.
బిజినెస్, పాలిటిక్స్,ఎంటర్టైన్మెంట్ రంగం సహా అన్ని రంగాల వారికి సమర్థవంతమైన సంభాషణ అవసరమని సుమ పేర్కొన్నారు. గట్టిగా మాట్లాడటం కంటే మాటల్లో క్లారిటీ, అర్థం ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. గతంలో నిర్వహించిన ఆన్లైన్ వర్క్‌షాప్‌కు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి దాదాపు 300 మంది నమోదు చేసుకున్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ బ్నిమ్(Bnim) కూడా ఈ శిక్షణపై ఆసక్తి చూపడం విశేషం.







