ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి (Uday Krishna Reddy) కేసు మరో మలుపు తిరిగింది. ఉదయ్ సోదరుడు ప్రణయ్కృష్ణారెడ్డి (Pranay Krishna Reddy)ని పోలీసులు ఏ2గా చేర్చారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) పై లైంగిక వేధింపుల కేసులో ఆధారాలను తారుమారు చేయడంలో ప్రణయ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు (Police) గుర్తించారు. ఉదయ్ ఫోన్ను ప్రణయ్ దాచినట్టు నిర్ధరణకు వచ్చారు. జాతీయ పోలీసు అకాడమీ (National Police Academy)లో తనపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డి పై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడం, అనంతరం అతడు జైలుకెళ్లిన విషయం తెలిసిందే.







