వైట్ డ్రెస్‌లో ఐషా శర్మ అందాల సందడి
సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేసే ఐషా శర్మ(Aisha sharma).. తన ఫ్యాషన్ ఎంపికలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ బ్యూటీ ఐషా శర్మ తన లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అందాల సందడి చేస్తోంది. సముద్ర తీరంలోని అందమైన రిసార్ట్‌లో వెకేషన్‌ను ఆస్వాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ నెట్టెడ్ టాప్, మ్యాచింగ్ లాంగ్ స్కర్ట్ ధరించి కెమెరాకు పోజులిచ్చింది. సింపుల్ మేకప్, లూజ్ హెయిర్ తో నేచురల్ బ్యూటీని హైలైట్ చేసింది. నీలిరంగు సముద్రం, వాటర్ విల్లాల మధ్య ఐషా దిగిన ఫొటోలు నెట్టింట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. భారీ సైజులో ఉన్న స్ట్రా హ్యాట్ ధరించి బాల్కనీలో పోజులిచ్చిన తీరు ఆమె వెకేషన్ లుక్కు మరింత స్టైలిష్ టచ్ ను ఇచ్చింది. మరో ఫొటోలో రిసార్ట్ బాల్కనీలో నిలబడి తన గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంది. బీచ్ వెకేషన్‌కు తగ్గట్టుగా ట్రెండీ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఈ బ్యూటీ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. మొత్తానికి వైట్ డ్రెస్‌లో ఐషా శర్మ తన స్టైలిష్ అందాలతో మరోసారి ప్రత్యేకంగా నిలిచింది.







