అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టడీలో వేల మంది భారతీయ చిన్నారులు..!
అమెరికా వలసచట్టాల్ని మరింత కఠినతరం చేసుకుంటూ పోతున్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో.. చిన్నారుల బంగారుబాల్యం కస్టడీలో చితికిపోతోంది. చట్టం, నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండడంతో.. అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టడీలో కాలం వెళ్లబోస్తున్న చిన్నారుల సంఖ్య వేలల్లో ఉంటోంది. ఇమ్మిగ్రేషన్ దాడుల కారణంగా సరిహద్దుల్లో వదిలేసిన వారు, అనాథలుగా మారుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ కీలక అంశాన్ని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(USCBP) శాఖ నివేదికలు వెల్లడించాయి.
అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశం.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి వారిని దేశ బహిష్కరణ చేస్తోంది (Anti immigration crackdown). పెద్దలనే కాకుండా పిల్లలపైనా అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశం, ఇతర కారణాలతో 2023 నుంచి 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను ఇమిగ్రేషన్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా విడుదలైన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(USCBP) శాఖ నివేదికలు వెల్లడించాయి. వ
ఇవి కూడా చదవండి
ఈ విధంగా అమెరికాలోని ఒంటరిగా వీరి కస్టడీలో ఉన్న పిల్లల (Unaccompanied Children) సంఖ్యను అధికారులు 2024 ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షలుగా పేర్కొన్నారు.. 2026 అక్టోబర్ వరకు 722 మంది చిన్నారులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో అగ్రరాజ్యంలోని కఠిన వీసా నిబంధనలు, బహిష్కరణల వల్ల ఒంటరి భారతీయ పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తల్లిదండ్రులు లేదా బంధువులు చట్టబద్ధమైన హోదా కోసం తమ చిన్నారులను ‘గ్రీన్ కార్డ్ తెచ్చేవారిగా ఉపయోగించుకునేవారని’ ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పట్టుబడితే పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయే వారని ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. అటువంటి చిన్నారులకు ఇమిగ్రేషన్ సెంటర్లలో వసతి కల్పించి.. సంరక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపారు







