తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..ష్నైడర్ సంస్థకు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ష్నైడర్ సంస్థ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆహ్వానించారు. పారిస్ (Paris)లోని ష్నైడర్ ఎలక్ట్రిక్ కార్యాలయాన్ని సందర్శించిన, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు గ్వెనెల్ హుయెట్ (Gwenaelle Huet), వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీల్‌కుమార్ సింగ్ (Dr.Sunil Kumar Singh) తదితర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణ డేటా సెంటర్ల హబ్‌గా వేగంగా మారుతోందని, రాష్ట్రంలో విద్యుదీకరణ, డిజిటలైజేషన్, ఆటోమేషన్ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ష్నైడర్ సంస్థ మొత్తం ఆదాయంలో 30 శాతానికి పైగా డేటా సెంటర్ల వ్యాపారం నుంచే వచ్చే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాలను విస్తరించాలని కోరారు. ఇప్పటికే తెలంగాణలోని ష్నైడర్ తయారీ, పరిశోధన-అభివృద్ధి, విక్రయ విభాగాల్లో 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని, తెలంగాణ యూనిట్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన యూనిట్‌గా గుర్తింపు పొందడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.







