TiE50 తెలంగాణ 2026: రాష్ట్రంలోని అత్యంత ప్రతిభావంతమైన 50 స్టార్టప్ సంస్థల ప్రకటన – నివేదిక ఆవిష్కరణ
హైదరాబాద్, నవంబర్ 22, 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధిక వృద్ధి సామర్థ్యం కలిగిన 50 ఆశాజనక స్టార్టప్ సంస్థలను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో TiE హైదరాబాద్ చేపట్టిన ‘TiE50 తెలంగాణ 2026 – అత్యంత ఆశాజనకమైన 50 స్టార్టప్ సంస్థలు’ జాబితాను హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (HES 2026) వేదికగా ప్రకటించి, వార్షిక నివేదికను ఆవిష్కరించారు.
TiE50 తెలంగాణ 2026 జాబితాలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఫిన్‌టెక్, రోబోటిక్స్, స్వచ్ఛ ఇంధనం, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ తదితర విభిన్న రంగాలకు చెందిన సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇది తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తల వ్యవస్థలో పెరుగుతున్న వైవిధ్యాన్ని, ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
ఎంపికైన 50 సంస్థలు:
AdiOS Platform Private Limited, ADTCORE X Private Limited, AI Planet, Apex Cura Healthcare IT Solutions Private Limited, Astraphage Innovations Private Limited, Atlast Motogen Pvt Ltd, Avartan Labs Pvt Ltd, Befach International, Cognira AI, Cology Biosciences Private Limited, Consytel Life Sciences Private Limited, Deccan AI, Diagmed Health Tech Private Limited, Discover Bioinsights, D-NOME Pvt. Ltd., DronYug Unmanned Systems R & D Lab Pvt Ltd., Edict Labs, Enterprise Quotient (EQ), Essential Vantage OPC Pvt Ltd, Fifth Ocean Studio Private Limited, Finbooks.ai, Greenbreathe Innovations Pvt Ltd, Hiringhood, Hylenr Technologies Private Limited, Iquark Solutions Private Limited, Ithi Saga Digitech Private Limited, Jivica AI, Kaiteki Innovations Private Limited, KLVIN Technology Labs Pvt. Ltd., Kode Blue Technologies, Marktech Creations Pvt. Ltd., Medstown, Modha Technologies, Moicircle Fintech Private Limited, myRNA Biologics Pvt Ltd, Noddyy (Lohas One Private Limited), OriginHash, RubiscoBlack Environmental Technologies and Services Pvt. Ltd., SecurWeave Research Labs Private Limited, Skyshade Daylights Private Limited, Spatial Flytech Solution, Sportslet, Time2Heal Wellness Pvt Ltd, Tracert Services Pvt Ltd, Vahn, Vanix Technologies Private Limited, VYDHYO Healthcare Private Limited, WCB Robotics India, WearSynapse మరియు Zeromoblt.
Qualcomm కార్యక్రమ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న TiE50 తెలంగాణ 2026, ఆశాజనకమైన స్టార్టప్ సంస్థలను గుర్తించడం, వాటికి గుర్తింపు కల్పించడం, మార్గదర్శకత్వం అందించడం, పరిశ్రమ ప్రముఖులతో అనుసంధానం చేయడం, అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలతో TiE హైదరాబాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం.
ఈ సందర్భంగా TiE హైదరాబాద్ అధ్యక్షుడు మురళి కాకర్ల మాట్లాడుతూ, “TiE50 హైదరాబాద్ అనేది కేవలం ఆశాజనకమైన స్టార్టప్ సంస్థలను గుర్తించి, గౌరవించే కార్యక్రమం మాత్రమే కాదు. అవి మరింత అభివృద్ధి చెందేందుకు అవసరమైన అవకాశాలను సృష్టించే వేదిక కూడా. అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులు, వినియోగదారులు, పరిశ్రమ ప్రముఖులు, విస్తృత వ్యాపార రంగంతో అనుసంధానించడం మా లక్ష్యం. గుర్తింపు అనేది కేవలం ప్రశంసలకే పరిమితం కాకుండా, స్టార్టప్ సంస్థలు నిలకడైన వృద్ధిని సాధించడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని మేము విశ్వసిస్తున్నాం. బలమైన పారిశ్రామికవేత్తల వ్యవస్థను నిర్మించడంతో పాటు, తెలంగాణను ప్రపంచ స్టార్టప్ పటంలో ప్రముఖంగా నిలబెట్టేందుకు TiE50 ద్వారా కట్టుబడి ఉన్నాం” అని అన్నారు.
కేవలం గుర్తింపుతోనే పరిమితం కాకుండా, TiE50 2026లో ఎంపికైన స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులకు 12 నెలల పాటు నిరంతర సహకారం, ప్రత్యేక మార్గదర్శకత్వం (Mentorship), పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖులతో అనుసంధానం, రూ.5 లక్షలకు పైగా విలువైన భాగస్వామ్య ప్రయోజనాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన TiE నెట్‌వర్క్‌లోని 67కి పైగా చాప్టర్లు, 15,000 మందికి పైగా సభ్యులతో అనుసంధానం చేసుకునే అవకాశాలు కల్పించనున్నారు.

ఈ ఎంపిక ప్రక్రియలో Qualcomm, KPMG, Tempus Law Associates, Charantra, Rockwell Business School వంటి ప్రముఖ సంస్థలు తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని అందించాయి. ఎంపికకు సంబంధించిన మూల్యాంకన విధానం, ప్రమాణాల రూపకల్పనలో ఈ సంస్థలు స్వతంత్ర నైపుణ్యాన్ని అందించడంతో పాటు, పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయత, కచ్చితత్వంతో తెలంగాణలోని అత్యంత ఆశాజనకమైన 50 స్టార్టప్ సంస్థలను గుర్తించేందుకు, TiE50 తెలంగాణ నివేదిక రూపకల్పనకు తోడ్పడ్డాయి.
2025లో ప్రారంభమైన TiE50, తెలంగాణలోని ప్రతిభావంతమైన స్టార్టప్ సంస్థలకు గుర్తింపు కల్పించే వేదికగా మొదలై, నేడు వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం, విలువైన పరిచయాలు, అభివృద్ధి అవకాశాలను అందించే సమగ్ర కార్యక్రమంగా పరిణామం చెందింది. ఈ కార్యక్రమానికి తొలి ఏడాది 2025లో 400కు పైగా దరఖాస్తులు రాగా, 2026లో 465 దరఖాస్తులు అందాయి. ఇది రాష్ట్రంలోని స్టార్టప్ సంస్థల్లో ఈ కార్యక్రమం పట్ల పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
TiE హైదరాబాద్ TiE50 కమిటీ చైర్ గౌరవ్ మాథుర్ తెలిపిన వివరాల ప్రకారం, 2026లో అందిన దరఖాస్తుల నుంచి కఠినమైన మూల్యాంకన ప్రక్రియ ద్వారా 50 ఆశాజనకమైన సంస్థలను ఎంపిక చేశారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ప్రముఖ జ్యూరీ ముందు 134 మంది వ్యవస్థాపకులు తమ సంస్థల వివరాలను, వ్యాపార ప్రతిపాదనలను వివరించారు.
తెలంగాణలో పారిశ్రామికవేత్తల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సంస్థల మధ్య అర్థవంతమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, ఆశాజనకమైన స్టార్టప్ సంస్థలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు తోడ్పడటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. గుర్తింపు పొందిన సంస్థల సంఖ్య మాత్రమే కాకుండా, వాటికి లభించిన అవకాశాలు, ఏర్పడిన అనుసంధానాలు, బలోపేతమైన పారిశ్రామిక ప్రయాణాల ఆధారంగానే TiE50 విజయాన్ని అంచనా వేయాలని గౌరవ్ మాథుర్ అభిప్రాయపడ్డారు.







