కాంగ్రెస్ పీఏసీ సమావేశం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం (PAC Meeting) జరిగింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ బి.సందీప్‌కుమార్ (B. Sandeep Kumar) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశశానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చిస్తున్నారు. ఎస్ఐఆర్ అంశంపై రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాల భవిష్యత్ కార్యచరణపై చర్చ చేపట్టారు.







