తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారు..
పీసీసీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టిన సమయంలో అనేక మంది పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను బలవంతంగా, అక్రమ కేసుల ద్వారా కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పారు..
తెలంగాణలో కాంగ్రెస్ లేదు, మళ్లీ పెరగనివ్వకుండా అడ్డుకుంటానని కేసీఆర్ విర్రవీగాడు..
నేను పీసీసీ అధ్యక్షుడిగా డిజిటల్ మెంబర్షిప్ చేపట్టి 90 రోజుల్లో 48 లక్షల మెంబర్షిప్ చేయించాం..
దేశంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించాం..
ఆత్మవిశ్వాసాన్ని కేసీఆర్ దెబ్బతీసినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు విజయమో, వీర మరణమో అన్నట్లుగా సభ్యత్వం చేయించారు..
అత్యధిక సభ్యత్వం చేయించిన ప్రతి ఒక్కరినీ రాహుల్ గాంధీని కలిపించి అభినందింపజేశాం…
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 92,35,833 ఓట్లు తెచ్చుకుని 64 సీట్లు గెలుచుకుంది.. ఒక సీటు సీపీఐ గెలిచింది..
90 లక్షల ఓట్లు రావడం వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉంది..
పార్టీ కోసం పనిచేసిన అనేక మందికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం..
అనేక మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకుల ఇళ్లకు పార్టీ బీ ఫామ్ పంపించాం..
పార్టీ జిల్లా అధ్యక్షులుగా చేసిన 70 శాతం మంది ఇళ్లకు పార్టీ టికెట్ పంపించాం..
అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లాంటి వారు కష్టకాలంలో పార్టీ జెండా మోశారు.. అందుకే వారికి పార్టీ టికెట్లు ఇచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలను చేసింది..
గాంధీభవన్‌లో సమన్వయం చేసి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పారు..
పార్టీ కోసం పనిచేస్తానని మహేష్ గౌడ్ ఆ నాడు చెప్పారు.. తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యారు..
పార్టీ టికెట్ రాని అనేక మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చాం..
రాహుల్ గాంధీపై విశ్వాసంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి అయ్యారు..
నారాయణఖేడ్ టికెట్‌ను సంజీవరెడ్డి కోసం వచ్చిన బీ ఫామ్‌ను సురేష్ షెట్కర్ వదులుకున్నారు..
కాంగ్రెస్ పార్టీ సురేష్ షెట్కర్‌ను పార్లమెంట్ సభ్యుడిని చేసింది..
రాజకీయాల్లో అన్నాచెల్లెళ్లు కూడా ఇప్పుడు కొట్టుకుంటున్నారు.. ఇప్పుడు అందరూ చూస్తున్నారు..
రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని నమ్మితే సొమ్ము అవుతుంది…
తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి పదవి చాలా గౌరవమైంది..
అనేక మంది హేమాహేమీలు ఈ పదవిలో పనిచేశారు..
బీజేపీ 240 సీట్లు దాటే ప్రసక్తే లేదని గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పాను.. అదే జరిగింది..
బీజేపీకి 25 సీట్లు తగ్గి, కాంగ్రెస్‌కు 25 సీట్లు పెరిగి ఉంటే ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది..
రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..
క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి..
అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన వ్యూహం మేం రూపొందిస్తున్నాం..
ప్రతి ఒక్కరి ప్రవర్తన, మాట తీరును నిశితంగా గమనిస్తున్నాం..
ఏ నాయకుడు ముందు ఏం మాట్లాడుతున్నారు.. వెనుక ఏం మాట్లాడుతున్నారో సంపూర్ణంగా పార్టీ దగ్గర సమాచారం ఉంది..
రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకు ఒకసారి వస్తుంది..
ఎవరి శ్రమ ఎంత ఉందో ఎన్నికల సమయంలో కొలుస్తాం..
కష్టపడిన వాళ్లను గుర్తిస్తాం.. కష్టపడి చెడగొట్టే వాళ్లను కూడా గుర్తుపెట్టుకుంది.. కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం..
పార్టీ లైన్లో ఉంటే ఇంటికి పదవి దానంతట అదే వస్తుంది..
పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 65 మందికి పదవులు ఇచ్చాం..
గాంధీభవన్ చుట్టూ తిరిగినంత మాత్రాన, ఢిల్లీలో తిరిగినంత మాత్రాన పదవులు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే..
వెళ్లాల్సింది ఢిల్లీకి కాదు.. వెళ్లాల్సింది గ్రామాలు, తండాలు, పేదల దగ్గరకు..
పేదలకు ఆత్మబంధువు అయిన వాళ్లే కాంగ్రెస్ నాయకులు అవుతారు..
పార్టీ పట్ల చూపించే చిత్తశుద్ధి, శ్రమతోనే పదవులు వస్తాయి..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూర్ వెంకట్‌తో నామినేషన్ వేయించాం..
తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఆ నాడు బల్మూర్ వెంకట్ పోటీ చేశారు..
హుజూరాబాద్‌లో 3,700 ఓట్లు మాత్రమే ఆ నాడు వచ్చినా, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చేదాకా సాగింది.. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు..
ఎస్సీ వర్గీకరణను అమలు చేసి ఉపకులాల మధ్య సఖ్యత తెచ్చాం..
జంతువులకు కూడా దేశంలో లెక్క ఉంది.. కానీ బీసీలకు మాత్రం లెక్క లేదు..
95 ఏళ్ల తర్వాత తెలంగాణలో కులగణన చేసి చూపించాం..
అన్ని చట్టాలు, న్యాయస్థానాల ముందు నిలబడేలా కులగణన చేశాం..
కులగణనలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలబడింది..
తెలంగాణను చూసి కులగణన చేయాలని కేంద్రానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు..
గిగ్ వర్కర్ల కోసం మొదటిసారి తెలంగాణ చట్టం చేసింది.. దేశంలో మొదటి ప్రభుత్వం మనదే..
ఎన్టీఆర్ తరం, వైఎస్సార్ తరం, కేసీఆర్ తరం… నాలుగు దశాబ్దాల్లో అమలు చేసిన అన్ని పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని చేస్తున్నాం..
రోజుకు 37 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.. 13 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించాం…
కోటి మంది మహిళలకు చీరలు అందించాం..
25 వేల కోట్ల రైతు రుణమాఫీ.. 36 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఇచ్చాం..
95 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోళ్లు చేసి రైతు ఖాతాల్లో వేశాం..
4,75,000 మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చాం..
ఒంటరి మహిళలకు వందకు వంద శాతం పింఛన్లు ఇచ్చాం..
8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.. 2.25 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేశారు..
గతమే కానీ భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది..
తప్పుడు ప్రచారాన్నే నమ్ముకుని అధికారంలోకి వస్తామని అనుకుంటోంది..
కృష్ణా, గోదావరి నీళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు వస్తా.. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని చెప్పాను..
గతంలో గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా వేసి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపాం..
మరోసారి అధికారంలోకి వస్తామని సిద్దిపేటలో మరోసారి చెప్పా..
గత సమావేశాల్లో బీఆర్ఎస్ వాళ్లు వాళ్లంతట వాళ్లే బట్టలు విప్పుకుని అసెంబ్లీ ముందు నిలబడ్డారు..
మొన్న అంగీనే విప్పించా.. ఈసారి లాగు కూడా విప్పిస్తా..
హరీష్ రావుకు గొలుసు మీద ఉన్న సోయి తెలంగాణ ప్రజల మీద లేదు..
అగ్గిపెట్టె దొరకనోడు మంత్రి అయ్యాడు.. అగ్గిపెట్టె దొరికిన శ్రీకాంతాచారి అమరుడయ్యాడు..
అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె రావు గుడిబండలా తయారయ్యాడు..
మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. కార్యకర్తలు అధికారంలోకి తెస్తారు..
సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తాం..
కరువును ఎదుర్కోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి అన్ని వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం..
3,700 నుంచి 92 లక్షల ఓట్లు తెచ్చిన కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు..
వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లతో 90 సీట్లు గెలుస్తాం..
కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేస్తున్నాం..
52 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం..
3.42 కోట్ల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం..
బీఆర్ఎస్ నాయకులు కూడా మనం ఇచ్చిన సన్నబియ్యం తింటున్నారు..
బీఆర్ఎస్ నాయకుల ఆడపడుచులు మనం ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు..
బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో వెలుగులు వస్తున్నాయి..
బీఆర్ఎస్ వాళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం..
పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేస్తున్నాం..
ఇస్తున్న పథకాలను ప్రజలకు పార్టీ శ్రేణులు గుర్తు చేయాలి..
మంచిని మైక్‌లో చెప్పండి.. చెడును చెవిలో చెప్పాలి..
ప్రజలకు మనం ఏం చేశామో చెప్పాలి..
మహిళా సంఘాలకు 75 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశాం.. రెండు వేల కోట్ల రూపాయలను వడ్డీ కింద ప్రభుత్వం చెల్లించింది..
కోటి మంది ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేయబోతున్నాం..
అచ్చంపేట దగ్గరలో సేవాలాల్ మందిరాన్ని నిర్మించబోతున్నాం..
జ్యోతిబా ఫూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..
పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టుకోబోతున్నాం..
బలహీన వర్గాల నుంచి వచ్చి స్ఫూర్తిని ఇచ్చిన మహనీయుల విగ్రహాలు పెట్టాలని ఏనాడు కేసీఆర్ అనుకోలేదు..
కాళేశ్వరంలో చేసిన పాపాలు కడుక్కోవడానికి సచివాలయానికి కేసీఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు…
నేను కార్యకర్తల నాయకుడిని.. వాళ్ల ఆలోచన నాకు తెలుసు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని మాత్రమే కార్యకర్తలు కోరుకుంటారు.. పదవులు కాదు..
15 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం..
సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చింది.. వారిద్దరూ పార్టీ కోసం కష్టపడ్డారు..
పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు అడగకుండానే ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాం..
నిరాశలో ఉన్న నేతలకు భవిష్యత్తులో తప్పకుండా గుర్తింపు లభిస్తుంది..
పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎదురుగా వచ్చి డిస్కో డ్యాన్స్ చేస్తుంది..
చూసీ చూడనట్లు ఉంటే కొంత మంది నాయకులు ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటారు..
గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వరుసగా పదేళ్ల పాటు అధికారంలోకి వచ్చాయి.. ఇప్పుడు వరుసగా పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది..
రాహుల్ గాంధీని ప్రధానిని చేసే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలు భుజాన వేసుకోవాలి..
ఇందిరా గాంధీ చివరి శ్వాస విడిచినప్పుడు మెదక్ ఎంపీగా ఉన్నారు..
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎప్పుడూ అండగా ఉంది..
ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి అండగా ఉండాలి..
కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం..







