హ్యూస్టన్ లో మెక్ డొనాల్డ్స్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు
మెక్‌డొనాల్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో హ్యూస్టన్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. తన చివరి ఏసీఎం పానీయాల ప్రచార కార్యక్రమం ‘‘సిప్స్ ఆఫ్ లైట్ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం స్థానిక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌ను సంస్కృతి, కమ్యూనిటీ మరియు కొత్త పానీయాల పరిచయానికి వేదికగా అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు.
దక్షిణాసియా లైఫ్‌స్టైల్ క్రియేటర్లు పూజా టేలర్ ఖాన్, కికీ రాజ్ వ్యాఖ్యాతలుగా, రొనాల్డ్ మెక్‌డొనాల్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ఇన్ఫ్లుయెన్సర్ నిఖిల్ గుప్తా సహా మొత్తం 236 మంది హాజరయ్యారు. విభా (Vibha), ఏఎస్ఏఎన్ (ASAN), ఆపి నెట్వర్క్ హ్యూస్టన్ (AAPI Network Houston) వంటి కమ్యూనిటీ సంస్థల సహకారంతో హ్యూస్టన్‌లోని దక్షిణాసియా ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
‘‘హాలుడే సిప్ పరేడ్’’ తో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మూడు కొత్త కూల్ డ్రింక్స్ తో పాటు, మెక్‌డొనాల్డ్స్ అందిస్తున్న మొత్తం ఏడు రకాల కూల్ డ్రింక్స్ ని అతిథులకు పరిచయం చేశారు. మధ్యాహ్నం అంతా అతిథులు ‘ఫిట్ చెక్, సిప్ చెక్’ ఫోటో బూత్, విషింగ్ ట్రీతో పాటు ‘హెడ్, షోల్డర్స్, నీస్, బ్యాగ్!’, మరియు కళ్లకు గంతలు కట్టుకుని రుచిని గుర్తించే ‘నేమ్ దట్ సిప్’ వంటి ఆసక్తికరమైన ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక హ్యూస్టన్ నృత్యకారుల ప్రదర్శనలు, స్థానిక కళాకారిణి నకియా లోఖండ్వాలా ఆధ్వర్యంలో రోజంతా సాగిన మెహందీ (గోరింటాకు) కార్యక్రమం ఈ వేడుకలకు అసలైన సాంస్కృతిక శోభను తీసుకొచ్చాయి.
ప్రజల విశేష భాగస్వామ్యం, ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో ‘సిప్స్ ఆఫ్ లైట్’ వేడుక కుటుంబాలు, క్రియేటర్లు మరియు స్థానిక అభిమానులను ఒకే వేదికపైకి చేర్చి మరపురాని దీపావళి అనుభూతిని అందించింది. కొత్త పానీయాల పట్ల ఆసక్తిని పెంచుతూనే, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీ బంధాలను ఎలా బలోపేతం చేయవచ్చో చాటుతూ మెక్‌డొనాల్డ్స్ 2026 ఏసీఎం పానీయాల ప్రచార కార్యక్రమాలకు ఈ వేడుకతో ఘనంగా ముగింపు పలికింది.







