హైదరాబాద్లో తానా పురస్కారాల వేడుకలు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తానా ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘తానా పురస్కారాల ప్రదానోత్సవం’ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన పది మంది ప్రముఖులను ఈ వేదికపై ఘనంగా సత్కరించనున్నారు. ఈ వేడుకలకు రావాల్సిందిగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని తానా బోర్డ్ సభ్యుడు రవి పొట్లూరి స్వయంగా కలిసి ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుగారికి తానా నిర్వహిస్తున్న సేవలను, వేడుకల వివరాలను తెలియజేశారు. ఆయనకూడా తానా సేవలను అభినందిస్తూ, ఈ వేడుకలకు వస్తానని హామి ఇచ్చారు. కాగా ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులకు అవార్డులను అందజేయానున్నారు. వారిలో అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకులు డా. రామచంద్ర నాయుడు గల్లా , శ్రీ సుద్దాల అశోక్ తేజ (తానా అందె శ్రీ పురస్కారం), శ్రీమతి జమీలా నిషాత్, డా. సునితా కృష్ణన్, శ్రీ జయధీర్ తిరుమల రావు, శ్రీ గడ్డం సమ్మయ్య, శ్రీ చింతకింది మల్లేశం, శ్రీ చింతల వెంకట్ రెడ్డి, శ్రీ దాసరి కొండప్ప తదితరులు ఉన్నారు.







