భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాకి 19 నెలల జైలు శిక్ష విధించిన ఫెడరల్ కోర్టు
భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాకు న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టు 19 సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అమెరికాలో గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో ప్రమేయం వున్నందుకు ఈ శిక్ష విధించింది. అయితే హత్యకు కుట్ర పన్నండం, మనీలాండరింగ్ కుట్ర నేరాలను నిఖిల్ దర్యాప్తులో అంగీకరించాడు కూడా. పన్నూ హత్యకు ఏర్పాట్లు చేసేందుకు మాజీ భారత నిఘా అధికారి వికాస్ యాదవ్ 2023లో నిఖిల్ గుప్తాను నియమించుకున్నట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. ఆయనను ఇంకా అమెరికా కోర్టు ముందు హాజరుపరచలేదు.
ఈ హత్య చేసే క్రమంలో నిఖిల్ గుప్తా, అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) కోసం పనిచేస్తున్న ఒక రహస్యంగా ఓ మధ్యవర్తిని కూడా సంప్రదించడంతో ఈ హత్యాయత్నం భగ్నమైంది. ఆ వ్యక్తి, కిరాయి హంతకుడి వేషంలో ఉన్న ఒక అండర్ కవర్ ఏజెంట్‌ను నిఖిల్ గుప్తాకు పరిచయం చేయడంతో, దర్యాప్తు అధికారులు ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను నమోదు చేయగలిగారు.
అమెరికా మరియు కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూన్, స్వతంత్ర ఖలిస్తాన్ కోసం ప్రచారం చేస్తున్న ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (Sikhs for Justice) సంస్థ వ్యవస్థాపకుడు. భారత ప్రభుత్వం పన్నూన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడంతో పాటు ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థపై నిషేధం విధించింది. పన్నూ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు కూడా.







