ఇది మా ట్రాక్ రికార్డు : మంత్రి లోకేశ్
కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ ప్రాజెక్టులు తీసుకొస్తుంటే, వాటిని అడ్డుకోవడానికి వైసీపీ (YSRCP) నేతలు పిటిషన్లు (Petitions) వేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు లభిస్తున్న ఉద్యోగాలపై చర్చకు రావాలని జగన్‌కు ఆయస సవాల్ విసిరారు. వివిధ రంగాల్లోని అత్యుత్తమ బ్రాండ్లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే వేల ఉద్యోగాలు కల్పించాం. ఇది మా ట్రాక్ రికార్డు. ఈ క్రెడిట్‌ను చోరీ చేయడానికి క్యూ కట్టడంలో జగన్ (Jagan) బిజీగా ఉన్నారు. ఖాళీ మ్యాప్ మాత్రమే ఆయన ట్రాక్ రికార్డు అని పేర్కొన్నారు.







