సంచలన ప్రకటన … ఏకగ్రీవంగా ఎన్నుకుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల (Chandakacharla) సర్పంచి (Sarpanch) పదవికి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రూ.1.50 కోట్లు జమ చేస్తానని భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయస్వామీజీ (Dhananjaya Swamiji) సంచలన ప్రకటన చేశారు. చందకచర్ల తన స్వగ్రామమని, గ్రామస్థుల అభ్యర్థన మేరకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని టీడీపీ (TDP), వైసీపీ ( YSRCP) ఇతర పార్టీల నేతలను కలిసి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇస్తే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు.







