కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ పాలనలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు (Municipal corporations), 87 మున్సిపాలిటీలు ( Municipalities), నగర పంచాయతీల్లో (Nagar Panchayat) సోమవారం తొలి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ మేయర్లు (Deputy Mayors), వైస్ చైర్పర్సన్ల (Vice Chairpersons) ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ పదవుల పంపకాలపై కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 66, జనసేనకు 23, బీజేపీకి 9 డిప్యూటీ మేయర్, వైఎస్ చైర్పర్సన్ పదవులు దక్కనున్నాయి. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో పాలక బాధ్యతల స్వీకరణకు కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి.







