మహా పాదయాత్ర చరిత్ర సృష్టించబోతోంది : బండి సంజయ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. కరీంనగర్ లోని గురుద్వారా వద్ద సోలార్ ప్యానెల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ యాత్ర దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy)కి భయమని, అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై భాజపాను అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. భాజపాను తట్టుకునే దమ్ము కాంగ్రెస్కు లేదని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం తథ్యమని పేర్కొన్నారు. సర్ పై వాస్తవాలు తెలియజెప్పేందుకే నవంబర్ 23న మహా పాదయాత్ర (Maha Padayatra) చేపడుతున్నాం. కరీంనగర్లో జరిగే మహా పాదయాత్ర చరిత్ర సృష్టించబోతోంది. ఈ ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ (Sunil Bansal), రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు పాల్గొంటారు అని తెలిపారు.







