నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్‌ను ఆహ్వానించిన కిషన్ రెడ్డి
యువతను మత్తు మహమ్మారి నుంచి కాపాడేందుకు చేపట్టిన పోరాటానికి సినీనటుడు ప్రభాస్ (Prabhas) మద్దతు పలికారు. మాదక్యద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ వాక్స్ నషా ముక్త్ భారత్ (India) కార్యక్రమానికి రావాలని కోరుతూ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (G. Kishan Reddy) ఆయనను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి యాత్ర టీషర్టుల (T-shirts)ను ఆవిష్కరించారు. మాదక్యద్రవ్య రహిత భారత్ కోసం మనమంతా గొంతు విప్పుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ చర్యలతోనే మత్తు మహమ్మారిని అరికట్టలేమని సమాజంలో ప్రముఖులు, ప్రజలంతా చేతులు కలిపితేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కోట్ల మంది అభిమానులున్న ప్రభాస్ పిలుపుతో యువతలో గొప్ప చైతన్యం వస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.







