ఆయుధ సంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఇరాన్..!
ఇరాన్ తో యుద్ధం సింపుల్ గా అయిపోతుందని భావించి రంగంలోకి దిగిన ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వాస్తవం అర్థపడుతోంది. ఎప్పటికప్పుడు ఆయుధాలను అధునాతన సాంకేతిక నైపుణ్యంలో అప్ డేట్ చేస్తూ.. యుద్ధరంగంలోకి దించుతోంది ఇరాన్. దీంతో సరికొత్త ఆయుధాలు ప్రపంచానికి షాకిస్తున్నాయి కూడా. ఇప్పటికే కొన్నిరకాల డ్రోన్లతో.. అగ్రరాజ్యానికి చమటలు పట్టించిన ఇరాన్.. ఇప్పుడు ఒకేసారి రెండు క్షిపణులు ప్రయోగించి షాకిచ్చింది.
అమెరికాతో ఉద్రిక్తతల వేళ ఇరాన్ (Iran) సైన్యం సంచలన వీడియో విడుదల చేసింది. అందులో ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించగల కొత్త లాంచర్‌ను (Double Launcher) ప్రదర్శించింది. ద్రవ ఇంధనంతో నడిచే ఈ వ్యవస్థను ఆ దేశ దళాలు బహిరంగంగా ప్రదర్శించడం ఇదే మొదటిసారి. వీడియోలో భూగర్భ క్షిపణి నగరానికి (Missile City) సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ కమాండర్లు ఓ వాహనంపై సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ ఆయుధాలను వీక్షిస్తున్న దృశ్యాలున్నాయి. యాంటీ షిప్ మిస్సైళ్లు, సముద్ర మందుపాతరలు కూడా అక్కడ ఉన్నాయి. మరొక వీడియో ఫుటేజీలో పలు ఆయుధాలను ప్రదర్శించే దృశ్యాలున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఆ దేశ అణు, క్షిపణి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. మరోసారి టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సైన్యం తాజా వీడియోతో తమ ఆయుధ శక్తిని తక్కువగా అంచనా వేసిన అగ్రరాజ్యానికి డబుల్ షాక్ ఇచ్చింది. అమెరికా బలగాలను.. వారి మిత్రదేశాలను ఎదిరించగల ఆయుధాలు తమ వద్ద ఇంకా ఉన్నాయని సంకేతాలు ఇస్తోంది. ఇవి భూగర్భంలో చాలా లోతున ఉన్నందువల్ల వాటిని ధ్వంసం చేయడం అమెరికాకు సాధ్యం కాకపోవచ్చు. గల్ఫ్ దేశాలలోని తమ స్థావరాలపై ఇరాన్ చేసే దాడులను ఎదుర్కోవడం ఇకపై అమెరికా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలకు మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.







