హైదరాబాద్ మెట్రోకు రుణ సాయం నా పరిధిలో లేదు: అశ్వినీ వైష్ణవ్
హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) రెండోదశ విస్తరణకు ఆర్థిక సాయం అందించే అంశం తన పరిధిలోకి రాదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పష్టం చేశారు. రెండోదశ నిర్మాణం కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) రుణం ఇస్తామని చెప్పిన విషయం కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2 (Metro Phase-2)కు రుణాలు, నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పలుమార్లు అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయనకు వినతిపత్రాలు కూడా అందజేశారు. రెండోదశ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఐఆర్ఎఫ్సీ నిధుల అంశంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు.కానీ, సోమవారం ఆయన మీడియతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో, ఐఆర్ఎఫ్సీ ఆర్థిక సహకారం విషయాలేమీ తనకు తెలియదని చెప్పడం గమనార్హం.







