వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం :మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, తన అంచనా ప్రకారం వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సందీప్‌కుమార్ (Sandeep Kumar)తో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సమావేశమయ్యారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్కు సూచించినట్లు తెలిపారు.
రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. గత మూడేళ్లలో న్యాయం జరగని కార్యకర్తలకు గుర్తింపు కోసం కృషి చేస్తామన్నారు. ఏఐసీసీ, పీసీసీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి మళ్లీ అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ఇన్ఛార్జ్కు వివరించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ తొలిసారి రాష్ట్రానికి వచ్చినందున మర్యాదపూర్వకంగా కలిశామని, ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.







