తెలంగాణ నీటి హక్కులకు సమాధి కట్టింది కేసీఆర్, హరీశ్‌రావే : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రెస్‌మీట్ పాయింట్స్..
కృష్ణా నది జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది, హక్కులను కాపాడటం లేదని బీఆర్ఎస్ ఇటీవల పదే పదే చెబుతోంది..
వాదనల కంటే అబద్ధాలను నమ్ముకుని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని ప్రణాళికతో ప్రయత్నం చేస్తోంది..
పల్నాడు వాటర్ గ్రిడ్ గురించి హరీష్ రావు, కేటీఆర్ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి కారణమని అర్ధసత్యాలు, అబద్ధాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు..
2004 నుంచి 2006 వరకు వైఎస్ మంత్రివర్గంలో మంత్రులుగా, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు నీటి హక్కులను శాశ్వతంగా ఆంధ్రాకు తాకట్టు పెట్టారు..
కేవలం బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..
మీడియా కూడా వాస్తవాలను పరిశీలించాలి..
పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను మేం అడ్డుకోలేదన్నట్లుగా చెబుతున్నారు..
2022, ఫిబ్రవరి 16న వైఎస్ జగన్ ఏపీ సీఎంగా, తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవో నంబర్ 56ను విడుదల చేశారు..
జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ.1,200 కోట్లతో పల్నాడు, గుంటూరు జిల్లా తాగునీటి కోసం తీసుకున్నారు..
కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేలా పథకాన్ని తీసుకువచ్చారు..
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవో, అనుమతులపై కృష్ణా బోర్డు దగ్గర కానీ, జల్ జీవన్ మిషన్ దగ్గర కానీ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు..
అనుమతులు ఇచ్చినప్పుడు అభ్యంతరం పెట్టలేదు.. కేంద్ర ఆర్థిక సహకారంపై అభ్యంతరం చెప్పలేదు..
కానీ ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు మొదలైనట్లు బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తోంది..
వచ్చే ప్రభుత్వాలు అడ్డుకుంటాయన్న ఉద్దేశంతోనే 2022లోనే జీవో ఇచ్చారు..
మా దృష్టికి రాగానే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం..
పనులను ఆపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు..
బీఆర్ఎస్ పార్టీ మా చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు..
మా బాధ్యతను ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే ఉంటాం..
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులుగా ఉన్నారు..
అప్పుడే పోతిరెడ్డిపాడు ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడానికి అనుమతులు ఇచ్చామని నేను సిద్ధిపేటలో చెప్పాను.
మార్చి 29, 2005న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్‌లో పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యాన్ని పెంచి తరలించుకుపోతామని స్పష్టంగా పేర్కొన్నారు..
ఆ తర్వాత 13.9.2005న జీవో వచ్చింది..
మంత్రులుగా బడ్జెట్‌ను ఆమోదించారు.. అసెంబ్లీలో నిలదీయలేదు..
జీవో వచ్చినప్పుడు తాము మంత్రులుగా లేమని హరీష్ రావు చెబుతున్నాడు.. కానీ అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు వారు మంత్రులుగా ఉన్నారు.. ఈ పాపం వాళ్లదే..
నాయిని నర్సింహారెడ్డి ఆనాడు కడప జిల్లా మంత్రిగా వ్యవహరించారు..
కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మోచేతి నీళ్లు తాగింది మీరు కదా..
కృష్ణా జలాలను వైఎస్‌కు తాకట్టు పెట్టింది మీరు..
రూ.1,250 కోట్లతో పోతిరెడ్డిపాడు సామర్థ్య పెంపునకు అనుమతులు ఇచ్చారు…
రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయినప్పుడు హారతులు ఇచ్చింది హరీష్ రావు..
వార్డు మెంబర్ కాకుండానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను మంత్రిగా చేశారు..
హరీష్ రావు గురువు వైఎస్ఆర్..
వైఎస్ఆర్కు గురుదక్షిణ హరీష్ రావు చెల్లించాడు..
శ్రీశైలం వెనుక నుంచి ఏపీకి పోతిరెడ్డిపాడు లేదా మల్యాల లేదా ముచ్చుమర్రి నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చారు..
2020లో రాయలసీమ లిఫ్ట్‌కు అనుమతులు ఇచ్చారు..
తెలంగాణ ప్రాంత నీటి హక్కులకు సమాధి కట్టి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ వన్ ద్వారా 40 టీఎంసీల నీళ్లను తరలించుకుపోవడానికి జీవో 24-07-2004న ఇచ్చారు. అప్పుడు హరీష్ రావు మంత్రివర్గంలోనే ఉన్నాడు..
శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లు తీసుకోవడానికి ముచ్చుమర్రికి అనుమతి ఇచ్చారు..
తెలంగాణ నీటి హక్కులను శాశ్వత జలసమాధి చేసింది కేసీఆర్, హరీష్ రావు..
వీళ్లు వైఎస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే నీళ్ల తరలింపునకు జీవోలు ఇచ్చారు..
జూన్ 2, 2014న కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు, కేటీఆర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు..
ఉమ్మడి రాష్ట్రంలో అడ్డుకునే అవకాశం లేకపోయినా తెలంగాణ వచ్చాక అన్ని అవకాశాలు ఉన్నాయి..
811 టీఎంసీల కృష్ణా జలాల్లో 71 శాతం తెలంగాణలో పరివాహక ప్రాంతం, 29 శాతం ఆంధ్రాలో ఉంది..
పరివాహక ప్రాంతం ఆధారంగా చూస్తే తెలంగాణకు 578 టీఎంసీల వాటా రావాలి..
కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు సాగునీటి శాఖ మంత్రిగా జూన్ 26, 2015న కేంద్ర మంత్రి ఉమా భారతి సమక్షంలో ఆంధ్రాకు 512, తెలంగాణకు 298.96 టీఎంసీలు చాలనని సంతకం చేశారు..
చంద్రబాబుకు సరెండర్ అయి సంతకం పెట్టారు..
తెలంగాణ వచ్చిన తర్వాత పరివాహక ప్రాంతం ఆధారంగా, పాలమూరు కరువు గురించి మాట్లాడి చంద్రబాబును ఎదిరించి వాటా కోసం వాదించకుండా 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి తెలంగాణ నీటి హక్కులపై మరణశాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావు..
మామా, అల్లుళ్లు కలిసి సంతకం చేశారు..
ప్రతి ఏడాది చర్చించి ముందుకు వెళ్లే అవకాశం ఉండేది.. కానీ ఈ పంపకాలే శాశ్వతం అని 2020, జనవరి 29న ఒప్పుకున్నారు..
ఈ ప్రాంతానికి జలసమాధి కడుతూ కేసీఆర్ ఆనాడు సంతకం చేశారు..
24.02.2022న ప్రకాశం జిల్లాకు 0.22 టీఎంసీ నీటి కేటాయింపులకు జీవో 482ను ఇచ్చారు..
ప్రతిరోజూ 11 టీఎంసీల నీళ్లు ఆంధ్రా తరలించుకుపోవడానికి కేసీఆర్ సంతకాలు చేశారు..
2023-24లో 208.79 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రా తీసుకుంటే 119 టీఎంసీలను తెలంగాణ తీసుకుంది..
2024-25లో 285 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది..
2026లో తెలంగాణ 268 టీఎంసీలను వినియోగించుకుంది..
2027లో 132 టీఎంసీలు ఏపీ వాడుకుంటే… 110 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది..
26-27 సంవత్సరంలో 45.44 శాతం నీళ్లను తెలంగాణ వినియోగించుకుంది..
ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి, భీమా లాంటి ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు..
రాయలసీమ వైపు ఉన్న ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం పట్టుపట్టి పూర్తి చేసుకుంది..
లక్షా ఎనభై వేల కోట్లను కాంట్రాక్టర్లకు కేసీఆర్ చెల్లించాడు..
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎపీకి 4.47 టీఎంసీలు రోజు తరలించే కెపాసిటీ ఉంటే కేసీఆర్ సీఎం అయ్యాక 13.17 టీఎంసీలు తరలించుకుపోయేలా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి..
ఒక నదిని పూర్తిగా తరలించుకుపోయేలా ప్రాజెక్టులు కట్టారు..
రొయ్యల పులుసు, పంచభక్ష పరమాన్నాలు కేసీఆరే తిని అన్యాయం చేశాడు.
కేసీఆర్ సీఎం అయ్యాక రాయలసీమలో 8 ప్రాజెక్టులను నిర్మించారు.. వాయువేగంతో పూర్తి చేశారు..
కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు.. దీని వల్ల పూర్తిగా నష్టపోయాం..
కేసీఆర్ హయాంలో భూసేకరణపై 2014 నుంచి అక్టోబర్ 2023 వరకు రూ.11,255 కోట్లు ఖర్చు చేశారు..
ఏడాదికి సగటున రూ.1,187 కోట్ల మాత్రమే ఖర్చు చేశారు..
రూ.6,765 కోట్లను మా ప్రభుత్వం భూసేకరణకు కేటాయించింది..
ఏడాదికి రూ.2,417 కోట్లను సగటున ఖర్చు చేశాం..
వీలైనంత మేరకు కృష్ణా జలాలను తరలించాలని మేం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం..
45 వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉంటే రూ.3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు..
రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయి..
మా ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించాం..
మా ప్రభుత్వం రూ.3,518 కోట్లను భూసేకరణపై ఖర్చు చేసింది..
రూ.1,256 కోట్లను సగటున ఏడాదికి ఖర్చు చేశాం..
రూ.600 కోట్లను ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఖర్చు చేశాం..
ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ముంపు బాధితులను తరలించాలని, భూసేకరణ చేయాలని కేసీఆర్ ఆలోచించలేదు..
రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యేవి..
ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బరితెగించి నీళ్లు తరలించుకుపోయే అవకాశం ఉండేది కాదు..
ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కారణం కేసీఆర్..
టన్నుల కొద్దీ అబద్ధాలను సంచుల్లో వేసుకుని ఊర్లలో కేటీఆర్, హరీష్ రావు వెదజల్లి వస్తున్నారు..
వైఎస్ జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి విందు భోజనం పెట్టిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ వచ్చింది..
కేసీఆర్ మంచి మనిషి.. గోదావరి నీళ్లను శ్రీశైలం వరకు తీసుకెళ్లడానికి ముందుకు వచ్చారని జగన్ చెప్పారు..
ఎంపీగా గెలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు..
797 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో రాయలసీమ లిఫ్ట్ నుంచి నీళ్లు తీసుకుపోయేందుకు అనుమతి ఇచ్చారు.. నీళ్లు కాదు బురద కూడా దీని ద్వారా తీసుకుపోవచ్చు..
జగన్‌ను పిలిచి హారతి పట్టి కృష్ణా జలాలను సమర్పయామి చేసింది కేసీఆర్..
కేసీఆర్ అవినీతి గుర్తించి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు..
కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందాలి, మిగిలిపోయిన తెలంగాణ సంపదను ఎలాగైనా కొల్లగొట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు..
మూడో తరానికి సరిపోయేలా సంపాదించాలని చూస్తున్నాడు..
జల వివాదాలు శాశ్వతం.. ఏదో రకంగా వివాదాలు వస్తూనే ఉంటాయి..
ప్రభుత్వం చట్టానికి లోబడి సంబంధిత వ్యవస్థల్లో ఫిర్యాదు చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది..
హరీష్ రావుకు అంత తెలివి ఉంటే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్‌ను పక్కన పెట్టాడు..
నాకు సాగునీటి పారుదల శాఖను అప్పగించమని హరీష్ రావు అంటున్నాడు.. కానీ హరీష్ రావును ఆయన మామనే నమ్మలేదు.. మేం ఎలా నమ్ముతాం..
దొంగనే తాళం అడుగుతున్నట్లు హరీష్ రావు తీరు ఉంది..
బ్రిజేష్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నాం..
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సీఎంల దగ్గరకు వెళ్లి ప్రాజెక్టుల అనుమతుల కోసం కలిశాం..
ప్రధాని మోదీని సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై కలిశాం.. సీఆర్ పాటిల్‌ను లెక్కలేనన్ని సార్లు కలిశాం..
512 టీఎంసీల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని ఏపీ స్పష్టంగా చెబుతోంది..
ఈ ఒప్పందం తాత్కాలికమని చెప్పడానికి మాకు తల ప్రాణం తోకలోకి వస్తోంది..
కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కులను జలసమాధి చేసింది కేసీఆర్, హరీష్ రావు మాత్రమే..
ఉరేసినా, కోదండం వేసి కొట్టినా ఇది వారిద్దరికే వర్తిస్తుంది..
హక్కులను కాపాడటానికి శాయశక్తులా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం..







