ఘనంగా 101వ శ్రీ సత్యసాయి జయంతోత్సవం
అన్నమయ్యపురంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే వేడుకల్లో భాగంగా పద్మశ్రీ డా. శోభారాజు గారి శిష్య బృందం సాందీప్, సాయి తేజస్వి, ఆశ్రిత, గమ్య, రీతూ, రన్విత తదితరులు సంయుక్తంగా “ఓం మహా గణపతయే నమః, శ్రీ మహా గణపతయే నమః, ఓం నమః శివాయ ఓం నమః సాయినాథాయ, అల్లాహ్ సాయి – మౌలా సాయి, ఏసు బుద్ధ మహావీర, ఐ లవ్ యు సాయిబాబా, శ్రీ గురుభ్యోనమః, సాయి నీ పాట పాడుతాను” అనే స్వరపరిచిన సంకీర్తనలు సుస్వరంగా సాయి సంకీర్తనా గానం చేసారు.
ఈ సందర్భంగా శోభారాజు గారు మాట్లాడుతూ, 1996 నవంబర్ 19వ తేదీ సత్య సాయి బాబా వారి దివ్య హస్తాలతో శోభారాజు గారు రచించి, సంగీతం సమకూర్చిన “ఐ లవ్ యూ సాయి బాబా” అని ఆడియో రిలీజ్ వేడుక గడిచి ఈ రోజుతో మూడు దశాబ్దాలు పూర్తయినదని, ఆ కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయని సుశీల, యం. యస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఉండటం మరుపురాని గొప్ప అనూభూతి అని విచ్చేసిన భక్తులకు తెలిపారు.








