నవంబర్ 23 రాశిఫలాలు: ఈ 5 రాశులకు ఆకస్మిక ధనలాభం.. నిలిచిపోయిన డబ్బు చేతికి!
సోమవారం (నవంబర్ 23) గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారికి కొత్త ఆశలు కల్పించనున్నాయి. ముఖ్యంగా నవపంచమ యోగం, పరియన్ యోగం ప్రభావంతో ఆర్థికంగా ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. చాలాకాలంగా చేతికి అందని డబ్బు తిరిగి వచ్చే సూచనలు, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్కాటకంతో పాటు ఐదు రాశుల వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా. మరోవైపు కొన్ని రాశుల వారు ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మేష రాశి (Aries) వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. శివ చాలీసా పఠించడం మంచిది.
వృషభ రాశి (Taurus) వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. వ్యాపార భాగస్వాముల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శివ మంత్రాలను జపించడం మంచిది.
మిథున రాశి (Gemini) వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. పాత కస్టమర్ల ద్వారా వ్యాపారులకు మంచి ఆదాయం రావచ్చు. శివపార్వతులను పూజించడం శుభప్రదం.
కర్కాటక రాశి (Cancer) వారికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, అవకాశాలు రావచ్చు. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. గతంలో కోల్పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. శివుడికి ప్రత్యేక పూజలు చేయడం మంచిది.
సింహ రాశి (Leo) వారికి అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధించవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. శివాలయాన్ని సందర్శించండి.
కన్య రాశి (Virgo) వారికి బుధుడి అనుకూలతతో మంచి ఫలితాలు లభించవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్‌కు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. విద్యార్థులు, పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. శివ చాలీసా చదవడం మంచిది.
ఇవి కూడా చదవండి
తులా రాశి (Libra) వారికి కుటుంబ, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లాభాలు పొందవచ్చు. ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ప్రయోజనకరంగా మారతాయి. పాత ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. శివుడిని ఆరాధించండి.
వృశ్చిక రాశి (Scorpio) వారికి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. అనుకున్న ఫలితాలు రావడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆలయంలో దానధర్మాలు చేయడం మంచిది.
ధనుస్సు రాశి (Sagittarius) వారికి శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధించవచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. బంధువుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శివుడికి పూజలు చేయండి.
మకర రాశి (Capricorn) వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కొత్తగా చేపట్టే పనులు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఇంటికి బంధువులు లేదా ఆత్మీయులు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వేళ వివాదాలకు దూరంగా ఉండాలి. శివ మంత్రాలను పఠించండి.
కుంభ రాశి (Aquarius) వారు ఈరోజు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బయట ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. కొన్ని పనుల విషయంలో ప్రణాళికలను మార్చుకోవాల్సి రావచ్చు. శివలింగానికి జలాభిషేకం చేయడం శుభప్రదం.
మీన రాశి (Pisces) వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో చాలాకాలంగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. శివుడిని పూజించడం మంచిది.







