శ్రీ నృత్య అకాడమీ విద్యార్థులచే అన్నమయ్య సంకీర్తనలకు నృత్యార్చన
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో నవంబర్ 21, శనివారం అన్నమయ్యపురంలో నిర్వహించే వారాంతపు అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి) పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమవగా., సాయంత్రం 6 గంటలకు శ్రీమతి ప్రత్యూష గారి మార్గదర్శకత్వంలోని శ్రీ నృత్య అకాడమీ విద్యార్థులు అన్నమాచార్య సంకీర్తనలకు నృత్యార్చన సమర్పించనున్నారు. ఈ సందర్భంగా “ప్రణవాకారం”, “నాట్య గణపతి”, “భజ మనసా”, “వరవీణ”, “ఇందరికీ అభయము”, “వినాయక కౌత్వం”, “శ్యామలే మీనాక్షి”, “స్వరపల్లవి”, “విఘ్నరాజం భజే”, “నరసింహ కౌత్వం”, “పంకజముఖి”, “తిల్లానా”, “ఒకపరి ఒకపరి”, “నీలమేఘ శరీర” తదితర గీతాలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నృత్యార్చనలో ప్రణవి, ప్రియాంక, సాయి అక్షర, చిన్మయి, కుష్మిత, దీక్షిత, భావజ్ఞశ్రీ, తన్విత, హన్విత, సుకృతి, సాన్విక నంది, లేఖ్య, ఆశిక, మైత్రి, సృతిక, సాన్విక, ఐశ్వర్య, శ్రీ సహస్ర, ఆద్య సంహిత, ధృతి రాగ, భృథి, స్పూర్తి, దిశ, ధృతి తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సాయంత్రం 7 గంటలకు పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమాచార్య సంకీర్తనకు భావార్థ వివరణ అందించారు. అనంతరం స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగియనుంది.
అన్నమయ్య సంకీర్తనలను సంగీతం, నృత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్న తదుపరి కార్యక్రమాలలో భక్తులు, సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా అన్నమాచార్య భావనా వాహిని నిర్వాహకులు ఆహ్వానించారు.








