జనవరి 16 న TCA ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి అంటే.. తెలుగు వారందరికీ అతిపెద్ద పండగ. అత్యంత ముఖ్యమైన పండగ కూడా. భారత్ లోనే కాకుండా, విదేశాల్లోనూ తెలుగు వారు ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. వివిధ దేశాల్లో వున్న తెలుగు సొసైటీ మొత్తం ఒక చోట చేరి, ఆనందంగా సంబరాలు చేసుకుంటారు.
ఇందులో భాగంగా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 50వ స్వర్ణోత్సవ సంవత్సర వేడుకల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ రాబోయే కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను నిర్వాహకులు విడుదల చేశారు.
సంక్రాంతి సంబరాలు జనవరి 16, 2027 న టెక్సాస్ లోని పియర్ ల్యాండ్ లో వున్న మెక్లీన్ రోడ్లోని శ్రీ మీనాక్షి దేవస్థానంలో జరగనున్నాయి. “తెలుగు వారి సాంప్రదాయం – అందరికీ ఆదర్శం” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.houstontca.org వెబ్సైట్ను లేదా @tcahouston_2026 (ఇన్స్టాగ్రామ్), @houstontelugu (ఫేస్బుక్)లో చూడవచ్చని నిర్వాహకులు సూచించారు.







