OCI దరఖాస్తులపై హ్యూస్టన్ భారత కాన్సులేట్ లో ప్రత్యేక సదస్సు
హ్యూస్టన్ లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) దరఖాస్తులపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఓసీఐ దరఖాస్తు ఫారాలు, సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు మరియు సాధారణంగా తలెత్తే సందేహాలపై సమగ్ర మార్గదర్శకత్వం అందించారు. అలాగే, హాజరైన ప్రవాస భారతీయులు నేరుగా కాన్సులర్ అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రవాస భారతీయులకు చేరువయ్యేందుకు మరియు కాన్సులర్ సేవలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సకాలంలో అందించేందుకు హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ నిరంతర కృషి చేస్తోంది.ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించారు.







