విజయవాడ మేయర్ గా వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం
విజయవాడ (Vijayawada) నగరపాలక సంస్థలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. నగరంలోని అంబేడ్కర్ కళావేదికలో మేయర్, కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం జరిగింది. తొలుత మేయర్ (Mayor)గా వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నగరంలోని 86 వార్డుల కార్పొరేటర్ల (Corporators) ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. నగరంలో 86 డివిజన్లలో టీడీపీ 53, జనసేన 19, వైసీపీ 8, బీజేపీ 4, సీపీఎం ఒక డివిజన్లో గెలిచిన విషయం తెలిసిందే.







